రేవంత్ కు సురేఖ బంగారు రాఖీ - ఇదే కోరుకుంటున్నా, మనసులో మాట..!!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొండా సురేఖ సంచలనంగా మారారు. కుమార్తె సుస్మిత నేరుగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. సురేఖ నుంచి పార్టీ వివరణ తీసుకుంది. సురేఖ పై వేటు వేయాలని క్రమశిక్షణా సంఘం సిఫారసు చేసింది. పార్టీ అధి నాయకత్వం వద్ద నిర్ణయం పెండింగ్ లో ఉంది. ఈ సమయంలో సీఎం రేవంత్ ను కలిసిన సురేఖ రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. అదే సమయంలో తన మనసులో మాట బయట పెట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
మంత్రి కొండా సురేఖ పైన వేటు ఖాయమనే ప్రచారం వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొంటు న్నాయి. రాఖీ పండుగ వేళ మంత్రి కొండా సురేఖ అప్పాయింట్ మెంట్ తీసుకొని వెళ్లి మరీ సీఎం రేవంత్ కు రాఖీ కట్టారు. సహచర మంత్రి సీతక్కతో పాటుగా సురేఖ సీఎం కు రాఖీ కట్టారు. సీఎం సహా ఆయన అల్లుడు, మనవడికి రాఖీ కట్టినట్లు సురేఖ వెల్లడించారు. ముఖ్యమంత్రి కోపం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీని కట్టానని.. మూడేళ్లుగా రేవంత్ కు రాఖీ కడుతున్నానని సురేఖ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో రాజకీయంగా ఎలాంటి ప్రస్తావన రాలేదు. అయితే, సురేఖ మాత్రం ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. రేవంత్ సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నానని.. మహిళలకు సీఎం రేవంత్ ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. తాను ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసారు.

హైకమాండ్ నిర్ణయం ఏంటి..?
నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సహచర మంత్రి సీతక్క గారితో కలిసి సోదరులు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని వారి నివాసంలో కలసి, రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశాను.
— Konda Surekha (@iamkondasurekha) August 28, 2026
మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా… pic.twitter.com/SwelDvHyxy
కాగా, ప్రస్తుతం కొండా సురేఖ వ్యవహారం పైన హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసీ వేణుగోపాల్ విదేశాల నుంచి వచ్చిన తరువాత సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ వెళ్లి సమావేశం కానున్నారు. ఆ సమయంలో సురేఖ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొండా సురేఖ ను తప్పిస్తే ఆ స్థానంలో ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల లోగానే సురేఖ ను రాజీనామా చేయమని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. సురేఖ మాత్రం ఈ వివాదం నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ అవకాశం ఇస్తే వ్యక్తిగతంగా తన వాదన వినిపించేందుకు సిద్దమయ్యారు. అయినా.. ఈ రోజు ఆ అవకాశం సురేఖ కు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో.. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకునే పరిణామాలు కీలకంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications