చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఎన్ని వేల కోట్ల ఆస్తులంటే?

రంగారెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి ఆస్తులు, అప్పుల గురించిన వివరాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తి వివరాలను తన అఫిడవిట్‌లో వెల్లడించారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనకు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు చూపడం చర్చనీయాంశంగా మారింది. విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన భార్య, కొడుకు ఆస్తుల మొత్తం రూ. 4488 కోట్ల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటికి స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తుల విలువ రూ. 4564.21 కోట్లు. ఈ ఆస్తులతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి దేశంలోని శ్రీమంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారు.

konda vishweshwar reddy described his family assets and debts in his nomination affidavit

చరాస్తులు వివరాలు:

విశ్వేశ్వర్ రెడ్డి చరాస్తులు రూ. 1178 కోట్లు
విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి చరాస్తులు రూ. 3203 కోట్లు
విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు విరాజ్ మాధవ్ చరాస్తులు రూ. 107 కోట్లు

స్థిరాస్తుల వివరాలు:
విశ్వేశ్వర్ రెడ్డి స్థిరాస్తులు: 71.34 కోట్లు
విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీతా రెడ్డి చరాస్తులు రూ. 3.6 కోట్లు
విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు విరాజ్ మాధవ్ చరాస్తులు రూ. 1.27 కోట్లు

అప్పులు వివరాలు:
విశ్వేశ్వర్ రెడ్డి అప్పులు రూ. 1.76 కోట్లు
విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీతా రెడ్డి అప్పులు రూ. 12 కోట్లు

కాగా, విశ్వేశ్వర్ రెడ్డికి, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం అపోలో హాస్పిటల్స్ గ్రూపునకు సంబంధించిన షేర్లే కావడం గమనార్హం. విశ్వేశ్వర్ రెడ్డికి అపోలోలో రూ. 973 కోట్ల విలువైన షేర్లు ఉండగా, ఆయన భార్యకు రూ. 1500 కోట్ల విలువైన షేర్లున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అపోలో గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్లలో దూసుకుపోవడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం రాజేంద్రనగర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్, తదితరులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+