Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి; కన్ఫ్యూజన్ లేదని క్లారిటీ!!

మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని పేర్కొన్న ఆయన తాను బీజేపీని వీడి ఎక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ ని మించిన సెక్యులర్ పార్టీ మరొకటి లేదని పేర్కొన్నారు. బీజేపీపై ప్రజలకు నమ్మకం ఉందని అదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు.

బిజెపి నుండి తాను మాత్రమే కాదు ఎవరూ పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యతిరేకులు ఆయనను ఓడించాలని రేవంత్ రెడ్డి చెప్పినట్టు, రేవంత్ రెడ్డి లక్ష్యం, తమ లక్ష్యం ఒకటే నని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. అయితే కేసీఆర్ ను ఢీకొట్టే ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

Konda Vishweshwar Reddy invited Revanth Reddy to BJP

కొంతమంది కావాలని తమ మీద ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న ఆయన తమకు బీఆర్ఎస్ తో పొత్తు ఉందని చెబుతున్నారని, ఒకవేళ పొత్తు లేకపోతే కవితను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే కవితను అరెస్టు చేయడం పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదని, అది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చేయవలసిన పని అన్నారు.కేసు విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని మాత్రమే పార్టీ కోరుకుంటుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

బిజెపిలో చాలా కన్ఫ్యూజన్ లో ఉందని చాలామంది అనుకుంటున్నారని, కానీ అటువంటిదేమీ లేదన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. పార్టీల లోనే బాగా కన్ఫ్యూజన్ లో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలు లేకుండా వ్యవహరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేస్తుందని విమర్శించారు.

గతంలో బలవంతంగా ఏపీ, తెలంగాణలను కలిపిందని, మళ్లీ రాజకీయ అవసరాల కోసం విడదీసింది అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీపై మతతత్వ పార్టీ అని ముద్ర వేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్లంతా దొంగలని, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పారని, కానీ బిజెపి నాయకులు ఎప్పుడూ ఆంధ్రోళ్లు దొంగలని అనలేదని పేర్కొన్నారు.

సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఇక తమను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి ఆయనే బీజేపీలోకి రావాలంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. బీజేపీ నేతలను కొనటం అంత ఈజీ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+