హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఓ మెట్రోపాలిటన్ సిటీ. నిత్యం ట్రాఫిక్, వాహనాల రద్దీ కారణంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో మెట్రో రైలు సదుపాయం ఉన్నా రద్దీ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. నగరవాసుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తోంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కారణంగా సమయానికి కార్యాలయాలకు చేరుకోవడంలో ఐటీ ఎంప్లాయిస్ కు ఆలస్యం అవుతోంది. ఈ క్రమంలో ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఓఆర్ఆర్ నుంచి కొండాపుర్ వంతెన ప్రారంభానికి రంగం సిద్ధమైంది. జూన్ మొదటి వారంలో ఫ్లైఓవర్ ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఐటీ కారిడార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. జూన్ మొదటి వారంలో ఓఆర్ఆర్ నుంచి కొండాపుర్ మధ్య ఉన్న ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వంతెన ప్రారంభానికి ఏర్పాట్లు వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అని స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి వద్ద ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ను తగ్గించడం కోసం ఇటీవల అంబర్ పేట ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. మొత్తం 1.7 కిలోమీటర్ల పొడవు ఉంది. నాలుగు లేన్లతో కలిసి ఉంది అంబర్ పేట ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి రూ.335 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.

Kondapur Flyover Nears Completion Major Relief for Hyderabad s IT Corridor

అంతకుముందు జనవరిలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. రూ. 799కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఆరాంఘర్ చౌరస్తా నుంచి నెహ్రూ జూ పార్క్ వరకు మొత్తం 6 లేన్లు, 4.8 కిలోమీటర్లు, 23 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ ను నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+