రాహుల్ రాజకీయ కార్యదర్శిగా మాజీ ఐఏఎస్ అధికారి?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఏఐసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా ఉన్న కొప్పుల రాజును నియమిస్తారని సమాచారం.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏఐసీసీ కార్యవర్గాన్ని బలోపేతం చేసే దిశగా పార్టీ కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొప్పుల రాజుకు ఈ పదవి వస్తుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.
గతంలో పేద, వెనుకబడిన వర్గాల సంక్షేమ పథకాల రచనలో రాజు కీలకపాత్ర పోషించారు. రాహుల్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్న ఆయన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు.

వీటితోపాటు రాహుల్ ప్రసంగాల కూర్పు, పార్టీ విధానాల రూపకల్పన విషయంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా అతి తక్కువ కాలంలో మంచిపేరు సంపాదించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల పాత్ర పెరగడానికి, అందుకు అనుగుణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కొప్పుల రాజు విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న కొప్పుల రాజుని బీహార్ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా నియమిస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఊపందుకుంది.












Click it and Unblock the Notifications