వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఆలోచిస్తారు, అసంతృప్తి నిజమే: కొప్పుల, సీఎంతో సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించలేదని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సోమవారం అన్నారు. కేబినెట్లో అవకాశం దక్కనందున కొప్పుల అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే.

ఆయన సోమవారం కేసీఆర్‌ను కలిసి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తాను కూ డా భాగస్వామిని అవుతానని చెప్పారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కనందుకు మాలలు కొంత ఆవేదనతో ఉన్నారనేది వాస్తవమే అన్నారు.

పార్టీకి ఇబ్బందికర పరిణామం ఉంటే తాను మరో ఆరు నెలలు ఆగేందుకు కూడా సిద్ధంగా ఉన్నాని చెప్పారు. తాను క్రమశిక్షణ కలిగిన తెరాస కార్యకర్తనని చెప్పారు. కేసీఆర్ ఏ పదవి ఇచ్చినా పని చేస్తానని తెలిపారు. సీఎం తనను పిలిచి అన్ని విషయాలు మాట్లాడారని చెప్పారు. కాగా, కేసీఆర్‌ను కొండా సురేఖ కూడా కలిశారు.

Koppula says he is ready to work with KCR

ధర్మపురి ఎమ్మెల్యే అయిన కొప్పుల ఈశ్వర్ తొలుత ఉప ముఖ్యమంత్రి పదవి, తర్వాత మంత్రి పదవి రేసులో ముందు నిలిచారు. అయితే, తాజాగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి దక్కింది. మాల సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్‌ సౌమ్యుడు, మృదుభాషి, వివాదరహితుడు, సీనియర్‌ నాయకుడు, అధిష్ఠానానికి విధేయుడు.

తెరాస 2001లో ఆవిర్భవించగా మొదటిసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న 2004లో కరీంనగర్‌ జిల్లా మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2009 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి మారి, గెలిచారు. 2010లో మళ్లీ రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014లోనూ ధర్మపురి నుంచే గెలుపొందారు.

తెరాస అధికారంలోకి రావటంతో కొప్పుల ఈశ్వర్‌ పేరును మొదట అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి రేసులోనూ ఆయన పేరు వినిపించింది. ఒక దశలో ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ, చివరికి మంత్రి పదవి కూడా దక్కలేదు.

ఎన్నికల ముందు పార్టీలో చేరిన రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని, మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న ఈశ్వర్‌కు అన్యాయం జరిగిందని ఆయన సానుభూతిపరులు వాపోయారు. ఈ క్రమంలో కొప్పుల ఈశ్వర్‌ను పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్‌ అనునయించారు.

కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఈశ్వర్‌కు ఈసారి మంత్రి పదవి ఖాయమని కేటీఆర్‌ బహిరంగంగానే ప్రకటించారు. సీఎం నుంచి కూడా ఆమేరకు హామీ లభించిందని అంటున్నారు. అయితే, ఆయనకు కేబినెట్లో అవకాశం రాలేదు. ఆయన అలక వహించడంతో గులాబీ ముఖ్యనేతలు ఆయనను బుజ్జగించారు.

English summary
Koppula Eshwar says he is ready to work with KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X