రేవంత్ ఎపిసోడ్: మారుతున్న పాలమూరు రాజకీయ చిత్రం, తమ్ముళ్ళ డుమ్మా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:రేవంత్‌రెడ్డి టిడిపికి రాజీనామా చేయడంతో పాలమూరు జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అధికార టిఆర్ఎస్‌ పావులు కదుపుతోంది. ఈ మేరకు రేవంత్‌రెడ్డితో పాటు ఇంతకాలంపాటు ఉన్న క్యాడర్‌ను తమ వైపుకు తిప్పుకొనేందుకు టిఆర్ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు కొందరు టిడిపి నేతలు కొడంగల్‌లో ఆదివారం నాడు చేవంత్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఏ ఎన్నికల్లోనైనా తాను కొడంగల్ నుండే పోటీచేస్తానని రేవంత్ ప్రకటించడంతో కొడంగల్‌లో రేవంత్‌కు పట్టున్న ప్రాంతాలపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది.

రంగంలోకి కుంతియా: రేవంత్‌ చేరికకు అభ్యంతరం లేదు: డికెఅరుణ

పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్‌ టిడిపికి రాజీనామా చేయడంతో టిడిపి నాయకత్వం కూడ రేవంత్‌ వెంట తమ పార్టీకి చెందిన నేతలు, క్యాడర్‌ వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది. మరో వైపు కొడంగల్ నియోజకవర్గంపై టిఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది.

రేవంత్‌ ఎపిసోడ్: సండ్రకు టిడిఎల్పీ పగ్గాలు , 3 ఏళ్ళలో మూడోవ్యక్తికి పగ్గాలు

టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్‌ కొడంగల్‌లోని తన నివాసంలో ఆదివారం నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.కోస్గి, మద్దూరు మండలాల నుంచి కొద్దిమంది నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. మరికొందరు నేతలు డుమ్మా కొట్టారు. మరోవైపు నియోజకవర్గంలోని మరికొందరు నేతలు రేవంత్ సమావేశానికి హజరుకాకుండా టిఆర్ఎస్‌లో చేరారు.

కొడంగల్‌లో టిఆర్ఎస్ వ్యూహమిదే: రేవంత్‌కు అగ్ని పరీక్షేనా?

 పాలమూరులో మారుతున్న రాజకీయాలు

పాలమూరులో మారుతున్న రాజకీయాలు

రేవంత్‌రెడ్డి టిడిపికి రాజీనామా చేయడంతో పాలమూరులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రేవంత్‌రెడ్డి పోటీచేయనున్నారు. అయితే కొడంగల్‌లో రేవంత్‌ను దెబ్బతీసేందుకు టిడిపితో ఉన్న నేతలు, ప్రజా ప్రతినిధులు, క్యాడర్‌ను టిఆర్ఎస్‌ తనవైపుకు తిప్పుకొంటుంది. ముగ్గురు మంత్రులు, టిఆర్ఎస్ ముఖ్య నేతలు కొడంగల్ అసెంబ్లీ నియోజకర్గంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. దీంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారోననే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

 కొడంగల్‌లో టిఆర్ఎస్ బలోపేతం కోసం చర్యలు

కొడంగల్‌లో టిఆర్ఎస్ బలోపేతం కోసం చర్యలు

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై , ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న రేవంత్‌ను నియోజకవర్గంలో బలహీనం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. మద్దూరు, దౌల్తాబాద్, కొడంగల్‌ వంటి మండలాల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు... ఆదివారం కూడా మద్దూరు మండలానికి కొందరు నేతలు హైదరాబాద్‌లో టిఆర్ఎస్‌లో చేరారు.

 కొడంగల్‌లో పార్టీ బలోపేతం కోసం టిడిపి ఇలా..

కొడంగల్‌లో పార్టీ బలోపేతం కోసం టిడిపి ఇలా..

రేవంత్‌ వెంట జిల్లా స్థాయి టిడిపి నేతలు కూడా వెళ్లకుండా ఆ పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది. 10 రోజుల క్రితమే జిల్లా సమావేశం ఏర్పాటు చేసి తాము రేవంత్‌ వెంట వెళ్ళేది లేదని మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు ప్రకటించారు. ఇప్పటి వరకు జిల్లాలో టీడీపీకి చెందిన నేత ఒక్కరూ కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించలేదు.

 రేవంత్ మీటింగ్‌కు టిడిపి నేతల డుమ్మా

రేవంత్ మీటింగ్‌కు టిడిపి నేతల డుమ్మా

కొడంగల్‌లో రేవంత్ నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి జిల్లా లోని కోస్గి, మద్దూరు మండలాలకు చెందిన నేతలు కొందరు డుమ్మా కొట్టారు. ముఖ్యంగా రేవంత్ కోస్గి మండలంలో మంచి పట్టుంది. అయితే ఈ మండలానికి చెందిన ఎంపీపీ నాగులపల్లి ప్రతాప్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ దోమ రాజేశ్వర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డీ.కే.రాములుతోపాటు సీనియర్‌ నాయకులు రేవంత్‌ సమావేశానికి దూరంగా ఉన్నారు. కోస్గి మండల అధ్యక్షుడు రా ఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి బెజ్జు రాములుతో పాటు గుండుమాల్, ము దిరెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లికి చెందిన నా యకులే హాజరయ్యారు.అంతేకాదు కొడంగల్‌లో రేవంత్‌ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే కోస్గిలో ఓ ముఖ్య నాయకుడు పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని వీడేది లేదని తీర్మానం చేసేనట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kosgi, Maddur TDP leaders didn't attend to Revanth meeting held at Kodangal on Sunday.Some of leaders joined in TRS. TRS leadership concertated on Kodangal assembly segment.
Please Wait while comments are loading...