చంద్రబాబు, లోకేష్ కమిటీ వేస్తే నిరూపిస్తా: కృష్ణా యాదవ్ సవాల్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి టికెట్ల పంపకంలో భారీగా డబ్బులు చేతులు మారాయని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి సి. కృష్ణా యాదవ్ ఆరోపించారు. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కార్యదర్శి లోకేశ్ జోక్యం చేసుకుని విచారణ కమిటీ వేస్తే ఆధారాలతో సహా నిరూపిస్తానని కృష్ణాయాదవ్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
క్రీయాశీలక కార్యకర్తలకు టిక్కెట్లు ఇవ్వలేదని అంటూ కార్ల డోర్లు తీసే వారికి, రాష్ట్ర నేతల ఇంటికి దర్వాజాలు, గేట్లు తీసేవారికి టిక్కెట్లు కేటాయించారని ఆయన అన్నారు. రాష్ట్ర నేతల కనుసైగల్లో నగరంలోని ముఖ్యనేలిద్దరు రెచ్చిపోయి డబ్బులున్న వారికే టిక్కెట్లు ఇచ్చారని అరోపించారు. టిక్కెట్ల కేటాయింపు జరిగిన అక్రమాలను నిరూపించేందుకు తాను సిద్దంగా ఉన్నాయని, పార్టీ తరపున విచారణ కమిటీ వేస్తే ఆధారాలు చూపిస్తానని ఆయన చెప్పారు.

సికింద్రాబాద్ నియోజకవర్గ వర్గంలోని ఓ డివిజన్‌కు సంబంధించి రూ. 60లక్షలు చేతులు మారాయని, మాల్లాపూర్ సీటుకు రూ.కోటి పలికిందని, చాలా చోట్ల అక్రమాలు జరిగినట్లు తన పరిశీలనలో తేలిందన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో ముగ్గురు, నలుగురు.. గ్రేటర్‌లో ఇద్దరి కబంధ హస్తాల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ స్టార్ హోటళ్లు, గెస్ట్‌హౌజ్‌లు, క్లబ్బుల్లో జరుగుతున్నాయని ఆయన అన్నారు.
టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతికి పార్టీ దిగజారిందని, తన 30 ఏండ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సిట్టింగ్ కార్పొరేటర్లు, మైనార్టీలు, బీసీలో ఓ వర్గం వారికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. అందుకు నిరసనగా పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కృష్ణాయాదవ్ ప్రకటించారు. బీజేపీ-టీడీపీ పొత్తులో కుట్ర జరిగిందని, ఇతర పార్టీలకు లబ్ధి జరిగేలా సీట్ల పంపకాలు జరిగాయని అరోపించారు.
సర్వేలు, సమావేశాలు నిర్వహించి చివరకు టిక్కెట్ల పంపిణీలో డబ్బులున్న వారికే మొగ్గు చూపారని, 92 స్థానాల్లో కష్టపడిన కార్యకర్తలు లేకపోవడం విచారకరమని అన్నారు. సిట్టింగ్ స్థానాల్లో ఏకైక ముస్లిం అశావహుడు అస్లాంకు తీరని అన్యాయం చేశారని, ఏం ముఖం పెట్టుకుని మైనార్టీ ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

సిట్టింగ్‌లైన అలియాబాద్ (జంగమెట్), హిమాయత్‌నగర్, ఝాన్సీబజార్, ఆసిఫ్‌నగర్, అమీర్‌పేటలాంటి డివిజన్లు బీజేపీకి ఇచ్చారని, పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీలో చాలా మందికి తీరని అన్యాయం జరిగిందన్నారు. అసంతృప్తులకు భరోసా ఇవ్వకుండా తమకేమి తేలియదన్నట్లు అగ్రనేతలు వ్యవహరించడం సిగ్గు చేటని విమర్శించారు.
ఎన్టీఆర్‌పై అభిమానంతో పార్టీలో కొనసాగుతున్న నేతలను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్టీ ఎవరి అబ్బా సొత్తు కాదని, క్రీయాశీలక స్వభ్యత్వం ఉన్న వారందరిదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కృష్ణాయాదవ్ హెచ్చరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications