Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు: వడోదర కృష్ణుడికి బంగారు ఊయల; భక్తులతో సందడిగా ఇస్కాన్ ఆలయాలు

దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కృష్ణ భక్తులు ఇస్కాన్ ఆలయాలకు వెళుతున్నారు. గోవర్ధన గిరిధారి అయిన కృష్ణుడు జన్మదినం నాడు అన్ని కృష్ణయ్య ఆలయాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

వడోదరా లక్ష్మీనారాయణ దేవాలయంలో కృష్ణుడికి బంగారు ఊయల

వడోదరా లక్ష్మీనారాయణ దేవాలయంలో కృష్ణుడికి బంగారు ఊయల

గుజరాత్ రాష్ట్రం వడోదరాలో లక్ష్మీనారాయణ దేవాలయంలో శ్రీకృష్ణుడికి బంగారంతో తయారుచేసిన ఊయలను భక్తులు సమర్పించారు. 200 గ్రాముల బంగారం, ఏడు కిలోల వెండి తో ఊయల తయారు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొత్తం ఈ బంగారు ఊయల తయారు చేయడానికి 50 లక్షల రూపాయలు ఖర్చయిందని వారు వెల్లడించారు. ఇదిలా ఉంటే జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుడు అవతరించిన రోజు తెలుగు రాష్ట్రాల లోని ఇస్కాన్ ఆలయాలలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు


లోక కల్యాణం కోసం కృష్ణుడిగా జన్మించిన కన్నయ్యజన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక కృష్ణాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఇస్కాన్‌ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూభారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నారు. కృష్ణుడి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. చక్కనైన అలంకరణలతో ఆలయాల్లో కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

 తిరుమలలో కృష్ణాష్టమి సందడి.. పోటెత్తిన భక్తులు

తిరుమలలో కృష్ణాష్టమి సందడి.. పోటెత్తిన భక్తులు


కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా శ్రీకృషుడి వేషధారణలో చిన్నారులు ఆకట్టుకుంటున్నారు. కృష్ణాష్టమి కావడంతో తిరుమల శ్రీవారి ఆలయానికిసైతం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో సైతం కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లోత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

హైదరాబాద్, ఇస్కాన్ దేవాలయాల్లో కృష్ణాష్టమి సందడి

హైదరాబాద్, ఇస్కాన్ దేవాలయాల్లో కృష్ణాష్టమి సందడి


ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని ఇస్కాన్ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ దేవాలయం కృష్ణుడు జన్మదిన వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరోపక్క ఓరుగల్లులోని ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండే ప్రత్యేక కార్యక్రమాలతో, పూజలతో కృష్ణపరమాత్మను భక్తులు దర్శించుకుంటున్నారు. వరంగల్ లోని ఇస్కాన్ దేవాయలంలో కృష్ణాష్టమి సందర్బంగా శ్రీకృష్ణరాధ సమేతులను వివిధ పుష్పాలంకరణతోచాలా అందంగా ముస్తాబు చేశారు. దేవాలయాన్ని రంగులరంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

పూజలు, కృష్ణుడి లీలా విలాసాలు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు

పూజలు, కృష్ణుడి లీలా విలాసాలు తెలిసేలా ప్రత్యేక కార్యక్రమాలు


శ్రీకృష్ణాష్టమి వేడుకలను తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా భక్తులు తరలిరానుండటంతో స్వామి వారినిదర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇస్కాన్ దేవాలయంతో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా గోపూజతోపాటు ప్రత్యేక హోమాలు, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేస్తున్నారు.శ్రీకృష్షాష్టమి విశిష్టతను భక్తులకు తెలిసేలా కృష్ణుడి లీలా విలాసాలను ప్రదర్శన గావిస్తున్నారు.

ఉట్టి కొట్టటానికి యువత ఆసక్తి... ఇంటింటా గోపికలు, కృష్ణయ్యలు

ఉట్టి కొట్టటానికి యువత ఆసక్తి... ఇంటింటా గోపికలు, కృష్ణయ్యలు


ఇక కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం కృష్ణుడికి బాగా ఇష్టమైన ఉట్టి కొట్టే కార్యక్రమాల పిల్లా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాడవాడలా ఉట్టి కొట్టేందుకు యువత సిద్ధం అవుతున్నారు. మహిళలు చిన్ని కృష్ణుడి పాదాలను ఇళ్ళ ముందు వేసి ఆ క్రిష్ణయ్యను ఇళ్ళలోకి ఆహ్వానిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. ఏ ఇంట్లో చూసినా చిన్నారి గోపికలు, మురళీధరులుగా కనిపిస్తున్న చిన్నారి కృష్ణులు కనువిందు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+