ఏపీ ‘కాపీ’కిదే సాక్ష్యం, తప్పును కూడా వదల్లేదు: కెటిఆర్(ఫొటోలు)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌(ఈవోడీబీ) ర్యాంకు వ్యవహారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్‌లైన్ అప్లికేషన్లను నిస్సిగ్గుగా చోరీ చేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ప్రతి సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇందులో ఎవరికి మంచి ర్యాంక్ వస్తే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు, ఇతర రంగాలకు చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నట్లుగా భావిస్తారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా కంపెనీలు, సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నట్లుగా పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ పరిశ్రమల శాఖ ఈవోడీబీ కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఆప్లికేషన్లను రూపొందించింది. పరిశ్రమలకు అనుమతుల జారీతోపాటు రెడ్ టేపిజం (జాప్యం) తగ్గించేందుకు ఈవోడీబీ ర్యాంకులు ఎంతో ఉపయోగపడతాయి. అంతర్గత విధానాలను సరళీకరించడమే దీని ఉద్దేశం. కానీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ అధికారులు రూపొందించిన ఆన్‌లైన్ ఆప్లికేషన్‌ను యథాతథంగా చోరీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు ఈవోడీబీ ర్యాంకులకు దరఖాస్తు చేసిందని తెలిపింది.

KTR complains to Centre about AP's 'unethical e-theft'

ఈఓడీబీ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు: కేంద్రమంత్రికి కెటిఆర్ ఫిర్యాదు

కాపీ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇదే అంశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు లేఖ రాశారు. పరిశ్రమల శాఖపై మంగళవారం సమీక్ష నిర్వహించిన సందర్భంలో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు శాఖ అధికారులు ఏపీ చేసిన పని తాలూకు వివరాలను అందించారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం ఇస్తున్న ఈవోడీబీ ర్యాంకుల కోసం కొన్ని రాష్ర్టాలు దీని స్ఫూర్తిని దెబ్బతిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ర్యాంకింగ్‌ల కోసం కొన్ని రాష్ట్రాలు అడ్డదారులు దొక్కుతున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుమతులు జారీ చేయడంలో పారదర్శకతను పెంచడంలో, రెడ్ టేపిజం తగ్గించడంలో ఈవోడీబీ ర్యాంకింగ్‌లు ఎంతో దోహదం చేస్తాయని, ఆ స్ఫూర్తితోనే తమ అంతర్గత విధానాలను సరళీకరించుకుంటున్నామని తెలిపారు.

KTR complains to Centre about AP's 'unethical e-theft'

అయితే కొన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్న అక్రమ పద్ధతులు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిజంగా మార్పులు చేసిన రాష్ర్టాలకు మాత్రమే తుది ర్యాంకుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, కాపీ సమాచారంతో వచ్చిన రాష్ర్టాలను గమనించాలని లేఖలో కోరారు.

30వ తేదీ తరువాత రాష్ర్టాలు సమర్పించిన సమాచారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రి లేఖలో విజ్ఞప్తిచేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈవోడీబీ ఉద్దేశాన్ని తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుందని, ఆ క్రమంలోనే రెడ్ టేపిజాన్ని తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకుందని తెలిపారు. జూన్ 27వ తేదీన సమావేశం డీఐపీపీ నుంచి తాము తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విధానాల పట్ల ప్రశంసలు కూడా పొందామని తెలిపారు.

జూన్ 30వరకున్న గడువును మరో వారం పొడిగించడం మంచి ఉద్దేశంతో చేసినదని, దీన్ని ఉపయోగించుకుని కొన్ని రాష్ర్టాలు అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. పలు అంశాలను ఇప్పటికే డీఐపీపీ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్లామని పేర్కొన్నారు.

ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం, పారదర్శకంగా వ్యవహరించడం ఈవోడీబీకి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. 30వ తేదీ తరువాత అప్‌లోడ్ చేసిన అన్ని అప్లికేషన్లను పక్కాగా తనిఖీ చేయాలని కోరారు. రాష్ర్టాలు ఎంతో కష్టపడి రూపొందించుకున్న అప్లికేషన్ల సమాచారాన్ని మరికొన్ని రాష్ర్టాలు తీసుకుని అప్లికేషన్లు రూపొందించడం ఏమాత్రం సరైంది కాదని, తనదికానీ సమాచారాన్ని తనదిగా పేర్కొనడం పారదర్శకత కాదని తెలిపారు.

KTR complains to Centre about AP's 'unethical e-theft'

తప్పులను కూడా కాపీ కొట్టారు!

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మక్కికి మక్కి కాపీ కొట్టిందనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని తెలంగాణ తెలిపింది. తెలంగాణ అప్లికేషన్‌లో అనుకోకుండా పడిన అక్షరదోషాన్ని కూడా ఏపీ అధికారులు సరిచేసుకోలేదంటే వారెంతగా తెలంగాణ అప్లికేషన్లపై ఆధారపడ్డారో అర్థం చేసుకోవచ్చని తెలంగాణ అధికారులు తెలతిపారు.

అంతే కాకుండా టీఎస్-ఐపాస్‌లో భాగంగా పరిశ్రమల కోసం ఒక సబ్‌మిషన్ రిఫెరెన్స్ నంబర్ అనే కాలమ్ రూపొందించారు. ఇది తెలంగాణకు మాత్రమే ఉన్న విశిష్ట విధానం. ఏపీలో ఈ విధానం లేకున్నా తమ వెబ్‌సైట్లలో కూడా సబ్‌మిషన్ రెఫరెన్స్ నంబర్ అనేదాన్ని చేర్చారు. ఈ నేపథ్యంలోనే డీఐపీపీ పొడిగించిన గడువును దుర్వినియోగపరుస్తూ తెలంగాణ అప్లికేషన్‌ను కాపీకొట్టి ఆంధ్రప్రదేశ్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుందని ఆరోపించారు.

ఈఓడీబీ ర్యాంకు కోసం ఆంధ్రప్రదేశ్‌ అడ్డదారిలో వెళ్తొందని, ఈవోడీబీ కోసం తాము రూపొందించిన ఒక అప్లికేషన్‌ నమూనాను ఆంధ్రప్రదేశ్‌ మక్కికిమక్కి కాపీ చేసిందని, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి తన ర్యాంకును పెంచుకుందని తెలంగాణ ఆరోపించింది. పరిశ్రమల శాఖ కమిషనర్‌ మాణిక్‌రాజ్‌, సంయుక్త కార్యదర్శి వి.సైదాలతో కలిసి తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

పోలీసులకు పరిశ్రమల శాఖ ఫిర్యాదు

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కోసం తాము తయారుచేసిన విధానాల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాపీ చేసిందని పేర్కొంటూ తెలంగాణ పరిశ్రమల శాఖ సంయుక్త సంచాలకులు సురేష్‌ హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాచేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డీసీపీ(నేరాలు) అవినాశ్‌ మొహంతిని అభ్యర్థించారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి కాపీరైట్‌ చట్టం 63 ప్రకారం కేసు నమోదు చేశారు.

www.lawtelangana.gov.in అన్న వెబ్‌సైట్‌లో ఒక లింక్‌పేజిని చూస్తే తాము రూపొందించిన పారిశ్రామిక విధానాలు, ఏపీ ప్రభుత్వ విధానాలు అచ్చుగుద్దినట్టున్నాయని సురేష్‌ సైబర్‌క్రైమ్‌ అధికారులకు చూపించారు. అందులోని అంశాలను పరిశీలించిన అధికారులు 'గుర్తు తెలియని సంస్థ'ను నిందితుడిగా పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న స్థానిక సంస్థలు, రెండు బహుళజాతి సాఫ్ట్‌వేర్‌ సంస్థలను సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఆయా సంస్థల ప్రతినిధులకు ఫోన్‌ చేసి బుధవారం విచారణకు హాజరుకావాలంటూ సమాచారం అందించామని అవినాష్‌ మొహంతి తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taking a serious note of AP government’s “unethical” behaviour of copying the information filed by the TS government for ease of doing business (EoDB) ranking, Industries minister KT Rama Rao lodged a complaint with Union minister of state for Commerce and Industry Nirmala Sitharaman on Tuesday, alleging that the neighbouring state has committed an “e-theft.”

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి