సిరుల సింగరేణికి కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్ : సిరుల సింగరేణికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తుందని ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సింగరేణి సంస్థను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
అద్భుత పనితీరు ..
గత ఐదేళ్లలో సింగరేణి కాలరీస్ అద్భుతమైన పనితీరు కనబరిచిందన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక .. సింగరేణి పనితీరు మరింత మెరుగుపడిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ సాధించిన విజయాలను పేర్కొన్నారు.

288 శాతం పెరిగిన లాభాలు ..
ఐదేళ్ల క్రితం వరకు సింగరేణి లాభాలు అంతంత మాత్రమేనని స్పష్టంచేశారు కేటీఆర్. సింగరేణి అమ్మకాలు రూ.11 వేల 929 కోట్ల నుంచి 117 శాతం పెరిగాయని గుర్తుచేశారు. ఇప్పుడు వాటి విలువ రూ.25 వేల 828 కోట్లకు చేరాయని సగర్వంగా వెల్లడించారు. అంతేకాదు సింగరేణి సంస్థ లాభాలు కూడా రూ. 419 కోట్ల నుంచి 288 శాతం పెరిగాయని తెలిపారు. వాటి విలువ రూ.1600 కోట్లకు పెరిగాయని గుర్తుచేశారు. సంస్థ విజయం కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన సంస్థ సీఎండీ శ్రీధర్, సిబ్బందిని కేటీఆర్ అభినందించారు. సంస్థ మరింత పురోగతి సాధించి .. రాష్ట్రానికి మరింత మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications