దీపావళిని మించిన పెద్ద పండగ.. అదే: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.

తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత, మిజోరంలల్లో పోలింగ్ ముగిసింది.

KTR extended greetings on the occasion of Diwali 2023

నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగిసింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొత్తంగా 4,795 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. 13వ తేదీన వాటి స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ పేపర్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 15.

ఎన్నికల ప్రచారంలో తీరిక లేెకుండా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలందరూ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీ కిషన్ రెడ్డి, డాక్టర్ కెే లక్ష్మణ్.. ఇలా సీనియర్లందరూ జిల్లాస్థాయిలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగారు.

దీపావళి పండగను పురస్కరించుకుని మంత్రి కేటీఆర్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన కొద్దిసేపటి కిందటే ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దీపావళి కంటే పెద్ద పండగ నవంబర్ 30వ తేదీ నాడు రాబోతోందని కేటీఆర్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో పోలింగ్ రోజును అతిపెద్ద పండగగా భావిస్తారని, 30వ తేదీన ఓట్ల పండగ ఉందని అన్నారు. ఈ ఓట్ల పండగలో అందరూ పాల్గొనాలని సూచించారు. అందరూ తప్పకుండా కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+