కేటీఆర్‌కు అరుదైన గౌరవం: వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం, రాష్ట్రమంత్రికి తొలిసారి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది.

చదవండి: 'కొందరు నీచులు నేర్పుతారా, బీజేపీని ఓడించాలనుకోవడం కుట్ర ఎలా అవుతుంది'

వరల్డ్ ఎకనామిక్ తొలిసారి ఓ రాష్ట్రమంత్రిని ఆహ్వానించడం విశేషం. 48వ ప్రపంచ ఆర్థిక సమావేశాలు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో జనవరి 18, 19వ తేదీలలో జరగనున్నాయి.

సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ఎంపిక చేసిన రాజకీయ నాయకులు, ఎన్జీవో ప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, మీడియా ప్రముఖులు రానున్నారు.

KTR invited for World Economic Forum meet

కేంద్రమంత్రులు, రాష్ట్రాల అధినేతలకు మాత్రమే ఇప్పటి వరకు వరల్డ్ ఎకనమిక్‌ సదస్సు ఆహ్వానాలు అందాయి. తొలిసారి ఒక రాష్ట్ర మంత్రికి ఆహ్వానం వచ్చింది. సదస్సులో పాల్గొనే అవకాశం రావటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: రజనీకాంత్-పవన్ కళ్యాణ్: అక్కడే ఇద్దరి మధ్య తేడా!

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయంలో మంత్రి కేటీఆర్ భాగస్వామ్యం.. తెలంగాణ పెట్టుబడుల ముఖచిత్రంగా ఉన్న తీరును ఫోరం పరిగణలోకి తీసుకున్నదని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a rare gesture, Industries and IT Minister KT Rama Rao received a special invitation to participate in the annual meeting of World Economic Forum to be held at Davos on January, 2018. The Minister expressed his happiness over the invitation and stated that he was looking forward to showcase the Telangana State government’s policies at World Economic Forum to attract investments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X