విచారణ వేళ అరెస్ట్ పై కేటీఆర్ కు ఉన్న సమాచారం ఏంటి, ఉత్కంఠ..!?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మారుతున్న సమీకరణాల వేళ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. తెలంగాణ కోసం ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చానని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదన్నారు. అసరమైతే నన్ను అరెస్టు చేస్తారు కావచ్చు అని చెప్పుకొచ్చారు. అన్నింటికీ తెగించే కోట్లాడుతున్నామని కేటీఆర్ చెప్పటంతో.. ఈ రోజు విచారణ వేళ చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.

మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరు వేళ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు.వేధింపులతో సాధించేమీ లేదని, అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. రేవంత్‌ రెడ్డి మీకు ధైర్యం ఉంటే లైడిటెక్టర్‌ పరీక్షకు రావాలని సవాల్‌ చేసారు. చట్టాలు, న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని.. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చానని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని వ్యాఖ్యానించారు. చట్టా లు, న్యాయస్థానాలపై గౌరవం ఉందని చెప్పిన కేటీఆర్..విచారణకు ఎన్నిసార్లైనా వస్తానని చెప్పానన్నారు. విచారణకు హాజరు ముందు కేటీఆర్ .. మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

KTR key comments on his Arrest amid ACB investigation in Formula E race case

ఈ కేసులో ఇప్పటికే అధికారులను ఏసీబీ విచారణ చేసింది. దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ ఏడాది జనవరిలో కేటీఆర్‌‌తో పాటు ఆ ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని పిలువగా.. కేటీఆర్ సమయం కోరారు.

దీంతో గత నెల 26న కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. మే 28న విచారణకు రావాల్సిందిగా కోరింది. ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నందున విదేశాల నుంచి తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. అందుకు అంగీకారం తెలిపిన ఏసీబీ.. గత వారం మరోసారి నోటీసులు జారీ చేసి ఈరోజు (జూన్ 16) విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. ఈ క్రమంలో నేడు ఏసీబీ ముందుకు రెండోసారి విచారణకు హాజరయ్యారు. అటు విచారణ.. ఇటు కేటీఆర్ అరెస్ట్ చేస్తారు కావచ్చనే వ్యాఖ్యల మధ్య గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+