వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ పక్కా ప్లాన్: తెలంగాణ ముఖ్యమంత్రి కేటిఆర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అద్యక్షుడు కె. చంద్రశేఖర రావు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ముందుకు రావాలని అనుకుంటున్నారు. దానికితోడు, జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని అనుకుంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ భవిష్యత్తు ముఖ్యమంత్రిగా తన తనయుడు కెటి రామారావును నిలబెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.

క్రమంగా బలపడుతూ వస్తున్న కేటీఆర్

క్రమంగా బలపడుతూ వస్తున్న కేటీఆర్

ప్రభుత్వంపైనే కాకుండా పార్టీపై కూడా కేటీఆర్ క్రమంగా పట్టు సాధిస్తున్నారు. హైదరాబాదు మహానగర పాలక (జిహెచ్ఎఎంసి) ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన తర్వాత కేటీఆర్‌కు తిరుగులేకుండా పోయింది. ఆ విజయం క్రెడిట్ మొత్తం కేటీఆర్‌కే వచ్చింది. దాంతోనే ఆయన కేసీఆర్ వారసుడిగా ముందుకు వచ్చారు. కేసిఆర్ తర్వాతి స్థానం కేటీఆర్‌దనే ముద్ర వేయించుకున్నారు.

తగిన భూమికను ఏర్పాటు చేస్తూ...

తగిన భూమికను ఏర్పాటు చేస్తూ...

తన వారసుడిగా కేటీఆర్‌ను నిలబెట్టేందుకు అవసరమైన భూమికను కేసీఆర్ ఏర్పాటు చేస్తూ వెళ్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం కేటీఆర్‌‌ను ముందుకు తెస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కేటీఆర్ పాత్రను పెంచారు తనను కలవడానికి వచ్చినవారిని కేసీఆర్ కేటీఆర్ వద్దకు పంపుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కేటీఆర్ అభిప్రాయం తీసుకోకుండా....

కేటీఆర్ అభిప్రాయం తీసుకోకుండా....

పార్టీ, ప్రభుత్వ పదవులను ఖరారు చేసే విషయంలో కేటీఆర్ మాటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన అభిప్రాయం తీసుకోకుంా ఏ నిర్ణయం కూడా జరగడం లేదని అంటున్నారు. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కాబోయే ముఖ్యమంత్రి కేటిఆరేననే అభిప్రాయం బలంగా ముందుకు వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో టికెట్లు...

వచ్చే ఎన్నికల్లో టికెట్లు...

వచ్చే ఎన్నికల్లో కేటిఆర్ విధేయులకే టికెట్లు దక్కుతాయనే అభిప్రాయం బలంగా ఉంది. వచ్చే ఎన్నికల వరకు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగి, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి పదవిని తనయుడికి కట్టబెట్టేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కేటిఆర్ సిఫార్సుల మేరకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీలోనూ ప్రధాన పాత్ర...

పార్టీలోనూ ప్రధాన పాత్ర...

పార్టీలో కూడా కేటిఆర్ ప్రధాన పాత్ర పోషించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే పార్టీ ఆవిర్భావ దినం సభా వేదిక మీదుగా కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని అంటున్నారు నిజానికి, గతంలోనే ఆ పనిచేయాలని అనకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల కేసిఆర్ వెనక్కి తగ్గారు. కేటీఆర్‌కు పార్టీలో ఎదురులేని వాతావరణాన్ని కల్పించడానికి కేసిఆర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు.

సీనియర్లు తనతో పాటు లోకసభకు...

సీనియర్లు తనతో పాటు లోకసభకు...

వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ శాసనసభకు, లోకసభకు పోటీ చేస్తారని అంటున్నారు. అదే సమయంలో పార్టీలోని సీనియర్లను లోకసభకు పోటీ చేయించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు రాష్ట్ర మంత్రులను లోకసభకు పోటీ దించుతారని అంటున్నారు. కేటిఆర్‌కు పూర్తి విధేయులుగా ఉండేవారిని శాసనసభకు పోటీ చేయిస్తారని అంటున్నారు.

English summary
It is said that Telangana CM and Telangana Rastra Samithi (TRS) chief K Chandraskhar Rao has made all arrangements to make his son KT Rama Rao as CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X