KTR: ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యల వ్యూహమిదే.. షాకింగ్ స్ట్రాటజీ సెలవిచ్చిన కేటీఆర్

లోక్సభ ఎన్నికలలో ఇప్పటికే ఎదురీదుతున్న బీఆర్ఎస్ పార్టీకి పార్టీ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే . తాజాగా ఆయన మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తో మల్కాజ్ గిరిలో నువ్ గెలుస్తున్నావ్ అన్నా అంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పి తెచ్చి పెట్టాయి. ఇక తాజాగా ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

మల్లారెడ్డి చాలా తెలివైన వ్యక్తి : కేటీఆర్
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణా భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ మాజీమంత్రి మల్లారెడ్డి తన రాజకీయ అనుభవంతోనే ఈటల రాజేందర్ పై ఆ కామెంట్స్ చేశారన్నారు. మల్లారెడ్డి చాలా తెలివైన వ్యక్తి అని, అందుకే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఈటల రాజేందర్ ను మునగచెట్టు ఎక్కించి క్రింద పడెయ్యాలన్నది ఆయన వ్యూహమని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.

KTR reveal the strategy of Ex minister mallareddy on etela rajender winning comments

ఆయన మాటల అంతర్యం తెలీదు చాలామందికి
మల్లారెడ్డి మాటల ఆంతర్యం తెలియక చాలామంది ఆగం అవుతున్నారని , ఆయన చేసిన వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకోవద్దన్నారు కేటీఆర్. మల్కాజ్ గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ అని, అది ఈటల రాజేందర్ కు కూడా తెలుసనీ వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మటం లేదన్నారు. రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలోకి వెళ్ళటం ఖాయం అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు
2023 ఎన్నికల తర్వాత తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు ప్రతీ ఇంట్లో కేసీఆర్ ను తలుచుకుంటున్నారు అన్నారు. అధికార కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుందని, అదేమని ప్రశ్నిస్తే తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్తున్నారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు అన్నారు.

కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై డమ్మీ అభ్యర్థులను పెట్టింది
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించటానికి కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై డమ్మీ అభ్యర్థులను పెట్టిందని అన్నారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే తమకు 10 నుండి 12 లోక్ సభ సీట్లను ప్రజలు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా మల్లారెడ్డి మాటలు సీరియస్ గా తీసుకోకూడదని, ఆయన తీరే అంత అంటూ చెప్పారు కేటీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+