తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్ .. ఆ నగదు ఖాతాల్లోకి

ప్రపంచ దేశాలను వణికిస్తుంది కరోనా మహమ్మారి . ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ 10,455 కేసులు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రాలను లాక్ డౌన్ చేసి ప్రజలకు కావలసిన మౌలిక అవసరాలను తీర్చే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో నిరుపేదలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో నిరుపేదలైన వారి కోసం తెలంగాణా ప్రభుత్వం ఉచిత రేషన్ ఇస్తామని, అలాగే 1500 రూపాయలు నగదు ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే రేషన్ అందిస్తున్న తెలంగాణా ప్రభుత్వం ఆర్ధిక సాయం కూడా అందించనుంది .

ఇక ఇప్పటికే పనులు లేక, ఇబ్బంది పడుతున్న పేదలు తెలంగాణా ప్రభుత్వం అందించే సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వం అందించే 1500రూపాయల సాయం విషయంలో కేటీఆర్ తెలంగాణాలోని నిరుపేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తక్కువ ఆదాయం గల తెల్ల రేషన్ కార్డు ఉన్నవారి బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు.

KTR said Good news to Telangana people about financial support in lock down time

ఆ ట్వీట్ లో "గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకి లింక్ అయి ఉన్నటువంటి 74లక్షల పైగా బ్యాంక్ ఖాతాల్లో నేడు 1500 జమ అవుతాయి" అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం మొత్తం రూ. 1,112 కోట్లను ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు తెలిపారు. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారిందని పేర్కొన్న సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం జీతంలో సగం ఇప్పుడు ఇస్తామని తెలిపారు. కానీ నిరుపేదల ఆకలి బాధలు తీర్చటానికి శాయశక్తులా పని చేస్తామని పేర్కొన్నారు .

Recommended Video

    Fake News Buster : 03 | సెల్ టవర్స్ నుంచి కరోనా వస్తుందా ? | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+