వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమంత ఫ్రీగానే చేస్తోంది, బతుకమ్మ చీరెలు తెలంగాణలోనే: కేటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని వారికి జీవితంపై భరోసా కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. ఈసారి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిపినట్లు తెలిపారు.

చేనేత కార్మికులను యజమానులుగా తీర్చి దిద్దే ఓ నూతన పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడారు రూ.203.35 కోట్లతో వర్కర్ టు ఓనర్ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

సమంతకు రూపాయి కూడా ఇవ్వడం లేదు

సమంతకు రూపాయి కూడా ఇవ్వడం లేదు

రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీ నటి సమంతకు తమ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని కెటి రామారావు చెప్పారు. చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించడానికి ఆమె స్వచ్ఛందంగానే ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు పోచంపల్లి వస్త్రాలు, కరీంనగర్ ఫిలిగ్రీ కళాఖండాలు నిర్మల్ పెయింటింగ్స్‌ను కానుకలుగా అందించేలా చర్యలు తీసుకుంంటున్నట్లు తెలిపారు.

Recommended Video

రాజకీయాల్లోకి నాగార్జున కోడలు ?
 బతుకమ్మ చీరెలు రాష్ట్రంలోనే...

బతుకమ్మ చీరెలు రాష్ట్రంలోనే...

బతుకమ్మ చీరెలను ఈసారి పూర్తిగా రాష్ట్రంలోనే రూపొందిస్తున్నట్లు కెటి రామారావు తెలిపారు. గత బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తెచ్చిన చీరెలను పంపిణీ చేశారనే విమర్శలు వచ్చాయి. అవి నాసిరకంగా కూడా ఉన్నాయని ఆరోపించారు. కొన్ని చోట్ల చీరెలను దగ్ధం చేశారు కూడా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ ఆ విషయం చెప్పారు.

 వారికి ఇలా చేస్తాం....

వారికి ఇలా చేస్తాం....

ఆత్మహత్యల స్థితిగతుల నుంచి వారికి చేతి నిండా పని, కడుపు నిండా తిండి అనే విధంగా ప్రభుత్వం చేనేత కార్మికులకు చేయూత ఇస్తుందని కెటిఆర్ చెప్పారు. వర్కర్ టు ఓనర్ స్కీంలో భాగంగా రాష్ట్రంలో 1104 మందిని ఎంపిక చేస్తామని, ఆ పథకాన్ని రూ.20335 కోట్లతో అమలు చేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో టెస్కో షోరూంలు

రాష్ట్రంలో టెస్కో షోరూంలు

చేనేత వస్త్రాల కోసం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో టెస్కో షోరూంలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 35 వేల మరమగ్గాల ఆధుకీరణకు చర్యలు తసుకుంటున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

English summary
Telangana minister KT Rama Rao clarified that actress Samantha is not being paid by governement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X