హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్య .. సిద్ధిపేట మెజార్టీ తగ్గిందన్న కేటీఆర్
Recommended Video
తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కేటీఆర్ ఫెయిల్ అయ్యారన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చోట కొన్ని ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యామని అన్నారు. మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలుసు. తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకసభ ఎన్నికల్లో తను సరైన ఫలితాలను రాబట్టలేకపోయాననేది వాస్తవమని, అంత మాత్రాన తాను విఫలం కాలేదని కేటీఆర్ అన్నారు.

హరీష్ రావు ఇంచార్జ్ గా వ్యవహరించిన మెదక్ లోకసభ స్థానంలో మూడు లక్షలకు పైగా మెజారిటీ రావడంపై ఆయన స్పందించారు. మెదక్ లోకసభ స్థానంలో పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ వచ్చినప్పటికీ సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గంలో ఓట్లు బాగా తగ్గిపోయాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హరీష్ రావును పక్కన పెట్టామనే విషయం వాస్తవం కాదని ఆయన అన్నారు.
కవిత ఓడిపోవడానికి రైతుల మూకుమ్మడి పోటీ కారణం కాదన్న కేటీఆర్ నామినేషన్లు వేసినవారు రైతులు కారని, రాజకీయ నేతలని ఆయన అన్నారు.గతంలో తాను, కవిత ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని ఒక్క ఓటమి తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయలేదని ఆయన అన్నారు.కేంద్రంలో బిజెపి పూర్తి మెజారిటీ సాధించింది కాబట్టి తాము 16 సీట్లు గెలుచుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండేది కాదని కేటీఆర్ అన్నారు. మొత్తానికి హరీష్ నియోజకవర్గంలో ఓట్ల శాతం బాగా తగ్గిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్య చేశారు.












Click it and Unblock the Notifications