రేవంత్ దమ్ముంటే - కేటీఆర్ హెచ్చరిక..!!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సీఎం రేవంత్ వర్సస్ కేటీఆర్ గా మారాయి. కొంత కాలంగా ఈ ఇద్దరి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే వార్తలతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం టర్న్ తీసుకుంది. తాజాగా లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావనతో మరింత ఉత్కంఠ పెరిగింది. లగచర్ల రైతుల ను సంగారెడ్డి జైలులో పరామర్శించిన కేటీఆర్ .. సీఎం రేవంత్ కు హెచ్చరిక చేసారు.
కేటీఆర్ పరామర్శ
ముఖ్యమంత్రి రేవంత్ పైన కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రేవంత్ కు దమ్ముంటే తమతో కోట్లాడాలని.. రాజకీయంగా తలపడాలని సూచించారు. పేదలకు మాత్రం నష్టం చేయవద్దని కోరారు. రేవంత్ నిర్ణయాలతో ఇప్పుడు కొడంగల్ తిరగబడిందని.. త్వరలోనే తెలంగాణ మొత్తంగా తిరగబడుతుందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో తమకు తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతులను థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారని ఆరోపించారు. అరెస్ట్ అయిన రైతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఉన్నారన్నారు. బాధితుల కాళ్లు, చేతలు కమిలి పోయి ఉన్నాయని కేటీఆర్ వివరించారు.

న్యాయ పోరాటం చేస్తాం
లగచర్లలో రైతుల ఇళ్ల తలుపులు పగులకొడుతూ.. బూతులు మాట్లాడుతూ కొందరు ప్రయివేటు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ తన పదవి అయిదేళ్లు మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే రేపు పదవి నుంచి తీసేస్తే దిక్కు లేదని ఎద్దేవా చేసారు. జైలలో పెట్టిన 21 మంది కుటుంబాల ఉసురు రేవంత్ కు తగులుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని.. వారికి బెయిల్ కోసం తాము న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్‌పై దాడి జరిగాక బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని పేర్కొన్నారు.
అండగా నిలుస్తాం
సంగారెడ్డి జిల్లా న్యాలకల్ లోను అలాగే గొడవ జరుగుతుందన్నారు. హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారని కేటీఆర్ మండి పడ్డారు. కేసీఆర్ బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. తిరుపతి రెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడేవాడు లేరని స్పష్టం చేసారు. అవసరం అయితే సుప్రీం కోర్టుకి వెళతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. చిన్న పిల్లలు కూడా కలెక్టర్‌ను కొట్టారు అని కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications