భార్య సలహాలు తీసుకున్న కేటీఆర్, 'కవిత గారు' ఇబ్బంది పడ్డ కేటీఆర్

నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన జనహిత ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీలను పేరు పేరునా పలకరించారు. ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన..

ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన జనహిత ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీలను పేరు పేరునా పలకరించారు. ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. 'కవితను కవితగారు, ఎంపీగారు అనడానికి తనకు మనసొప్పుట లేదన్నారు.

ఎందుకంటే, చిన్నప్పటి నుంచి కవిత అని పిలిచి, ఇప్పుడు హఠాత్తుగా ఎంపీగారు, గౌరవనీయులు అని సంబోధించాలంటే కొంత ఇబ్బందిగా ఉందన్నారు. దీంతో సభలో నవ్వులు చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిసారిగా ఇద్దరమూ ఒకే వేదికను పంచుకున్నామన్నారు.

ఉద్యమమే..

ఉద్యమమే..

తనను, కవితను నాయకులుగా, వక్తలుగా తీర్చిదిద్దేందుకు తమ తండ్రి ప్రయత్నించలేదని, తెలంగాణ ఉద్యమమే తమను నేతలుగా నిలిపిందని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ జోక్

కేటీఆర్ జోక్

ఈ సందర్భంగా ఓ జోక్ చెప్పి నవ్వించారు. ఇటువంటి పెద్ద బహిరంగ సభల్లో పాల్గొనేముందు, ఇంతమంది పెద్దలు కూర్చున్న వేదికలపై ప్రసంగించే ముందు అందరు తెలివైన మగవాళ్లు చేసే పనే నేను కూడా చేసి వస్తానని, ఇంట్లో బయలుదేరేటప్పుడు తన భార్యను అడిగానని, పెద్ద మీటింగ్‌కు వెళ్తున్నా, ఏం మాట్లాడాలని అడిగానని, అప్పుడు తన భార్య ఒక విషయం చెప్పిందని కేటీఆర్ అన్నారు.

భార్య సూచన

భార్య సూచన

అందరికంటే ముందు నీకు మైకిస్తే... తన తర్వాత పోచారం శ్రీనివాస రెడ్డిగారు, డీ శ్రీనివాస్ గారు, కవిత మాట్లాడుతారని, చాలా బాగా మాట్లాడతారని చెప్పి చప్పుడు చెయ్యక కూర్చోమని తన సతీమణి సలహా ఇచ్చారని కేటీఆర్ అన్నారు. మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే, తన కంటే ముందు మాట్లాడిన జీవన్ బ్రహ్మాండంగా మాట్లాడారని, తర్వాత మాట్లాడే శీనన్న ఇంకా బాగా మాట్లాడుతాడని చప్పుడు చెయ్యక కూర్చోమని సూచించిందన్నారు.

నవ్వేశారు

నవ్వేశారు

చివరలో మాట్లాడే అవకాశం వస్తే, ఇక అన్నీ వాళ్లు చెప్పారని, తనకు చెప్పేందుకు ఏమీ లేదని చప్పుడు చెయ్యక కూర్చోమని చెప్పిందని, ఇప్పుడు తన పరిస్థితి అలాగే ఉందని కేటీఆర్ అన్నారు. దీంతో సభా వేదికపై ఉన్న నాయకులతో పాటు, కార్యక్రమానికి హాజరైన వారంతా నవ్వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+