డల్లాస్‌లో వద్దన్నావినని కేటీఆర్, కొత్తకొత్తగా(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డల్లాస్‌లో ఎన్నారైలతో భేటీ అయ్యారు. హదైరాబాద్‌ను డల్లాస్‌లా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని, అందుకు అందరి సహకారం కావాలన్నారు. భారీ పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని చెప్పారు.
తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రవాస భారతీయులు కలిసి రావాలన్నారు. హైదరాబాదును ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాలన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన ప్రగతిని, అవకాశాలను వివరించాలన్నారు. బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.
కాగా, డల్లాస్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి విమానంలో వెళ్లాల్సి ఉండగా భారీ హిమపాతం, కుండపోత వర్షంతో డల్లాస్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. ఈ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో పర్యటన వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. అయినా కీలకమైన సమావేశాలు ఉండటంతో కుండపోత వర్షంలోను వ్యాన్లో రోడ్డు మార్గంలో 4 గంటలు ప్రయాణించి కేటీఆర్ ఆస్టిన్ నగరం చేరుకున్నారు.

కేటీఆర్
ప్రతి తెలంగాణ ఎన్నారై హైదరాబాద్‌ను ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాలని, ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అద్భుత ప్రగతి, అవకాశాలను విడమర్చి చెప్పాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

కేటీఆర్
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును దేశంలోని ఇతర రాష్ర్టాలూ అధ్యయనం చేయాలన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. మంత్రి తన అమెరికా పర్యటనలో ఐదో రోజు డల్లాస్‌లో విస్తృతంగా పర్యటనలు చేసి, సమావేశాలు నిర్వహించారు.

కేటీఆర్
వైబ్రాంట్ హైదరాబాద్ సీఈవో కనెక్ట్ కార్యక్రమంతో పాటు ఎన్నారైలతో సమావేశమయ్యారు. తెలంగాణ అసోసియేషన్, ఎన్నారై తెరాస నాయకులు, కార్యకర్తలనూ ఈ సందర్భంగా ఆయన కలిశారు.

కేటీఆర్
వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందని కంపెనీల సీఈఓల సమావేశంలో కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డల్లాస్ నగరాన్ని ఒక ఆదర్శనగరంగా భావిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications