Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిలికాన్ వ్యాలీని మించేలా: టి హబ్‌ను సందర్శించిన కెటిఆర్(పిక్చర్స్)

హైదరాబాద్: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, బెంగళూరులోని స్టార్టప్‌ల కేంద్రాన్ని మించేలా గచ్చిబౌలిలో ఐదు అంతస్తుల్లో టీ హబ్ భవనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి కే తారకరామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏడాదిపాటు శ్రమించి సిద్ధం చేసిన ఈ టీహబ్ నవంబర్ 5న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ శుక్రవారం టి హబ్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడోబ్ సీఈవో శంతను నారాయణ్ టీహబ్‌ను సందర్శించి మైమరచిపోయారని చెప్పారు. తాను, మైక్రోసాఫ్ట్ సీఈవో ఉన్న ఫొటోను సెల్ఫీ తీసుకొని సత్య నాదెళ్లకు పంపిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారని చెప్పారు. ఇంకోవైపు సిలికాన్ వ్యాలీలోనూ ఫ్రాంచైజీ ఏర్పాటుచేయనున్నామని, సోషల్ మీడియా ప్రచారం కల్పిస్తామని, స్టార్టప్ ఫెస్ట్ నిర్వహించనున్నామని వివరించారు.

తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే వారు భారీ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. అలాంటి వారికి ఆర్థిక తోడ్పాటు అందించే వారు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఈ రెండు వర్గాలను సమన్వయం చేయడమే టీ-హబ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దీనికి వేదిక టీహబ్ భవనమని చెప్పారు.

హైదరాబాద్ ఐఐఐటీలో 70వేల చదరపు అడుగులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ భవనం నిర్మించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ ఔత్సాహికులు, వారిని పోత్సహించే పారిశ్రామికవేత్తలైన వెంచర్ క్యాపిటలిస్టులు-ఏంజిల్ ఇన్వెస్టర్లను హైదరాబాద్‌కు ఆకర్షించడం ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.

విస్త్రృత స్థాయిలో నెట్‌వర్క్‌లను కొనసాగిస్తూ కొత్త ఆవిష్కరణలను తెరమీదకు తేవడం స్టార్టప్‌లకు తాము అందించే ముఖ్య సహకారమని తెలిపారు. ఈ క్రమంలో స్టార్టప్‌లను, పెట్టుబడిదారులను, రీసెర్చ్ సెంటర్‌లను విస్త్రృతంగా అందుబాటులోకి తేవడం తమ ఉద్దేశమన్నారు. ఈ కేంద్రంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ), ఐఐఐటీ, నల్సార్‌ల భాగస్వామ్యం ఉందని తెలిపారు.

‘ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఒకరకంగా చూస్తే టీ హబ్ ద్వారా ప్రభుత్వానికి నేరుగా దక్కే ప్రయోజనం లేదుగానీ... ఇప్పటికే ఐటీ రంగంలో పేరెన్నికగన్న హైదరాబాద్ స్టార్టప్‌ల రంగంలోనూ ఐకాన్‌గా మారుతుంది. అది మనకు గర్వకారణం. ఇక ఇక్కడి ఆవిష్కర్తలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. తద్వారా తెలంగాణ బిడ్డలకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయి కదా' అని మంత్రి కెటిఆర్ వివరించారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, బెంగళూరులోని స్టార్టప్‌ల కేంద్రాన్ని మించేలా గచ్చిబౌలిలో ఐదు అంతస్తుల్లో టీ హబ్ భవనం ఏర్పాటు చేశారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి కే తారకరామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏడాదిపాటు శ్రమించి సిద్ధం చేసిన ఈ టీహబ్ నవంబర్ 5న ప్రారంభం కానుంది.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ శుక్రవారం టి హబ్‌ను సందర్శించారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడోబ్ సీఈవో శంతను నారాయణ్ టీహబ్‌ను సందర్శించి మైమరచిపోయారని చెప్పారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

తాను, మైక్రోసాఫ్ట్ సీఈవో ఉన్న ఫొటోను సెల్ఫీ తీసుకొని సత్య నాదెళ్లకు పంపిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారని చెప్పారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

ఇంకోవైపు సిలికాన్ వ్యాలీలోనూ ఫ్రాంచైజీ ఏర్పాటుచేయనున్నామని, సోషల్ మీడియా ప్రచారం కల్పిస్తామని, స్టార్టప్ ఫెస్ట్ నిర్వహించనున్నామని వివరించారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోనూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే వారు భారీ సంఖ్యలో ఉన్నారని చెప్పారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

అలాంటి వారికి ఆర్థిక తోడ్పాటు అందించే వారు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారని తెలిపారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

ఈ రెండు వర్గాలను సమన్వయం చేయడమే టీ-హబ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దీనికి వేదిక టీహబ్ భవనమని చెప్పారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

హైదరాబాద్ ఐఐఐటీలో 70వేల చదరపు అడుగులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ భవనం నిర్మించామని చెప్పారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ ఔత్సాహికులు, వారిని పోత్సహించే పారిశ్రామికవేత్తలైన వెంచర్ క్యాపిటలిస్టులు-ఏంజిల్ ఇన్వెస్టర్లను హైదరాబాద్‌కు ఆకర్షించడం ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

విస్త్రృత స్థాయిలో నెట్‌వర్క్‌లను కొనసాగిస్తూ కొత్త ఆవిష్కరణలను తెరమీదకు తేవడం స్టార్టప్‌లకు తాము అందించే ముఖ్య సహకారమని తెలిపారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

ఈ క్రమంలో స్టార్టప్‌లను, పెట్టుబడిదారులను, రీసెర్చ్ సెంటర్‌లను విస్త్రృతంగా అందుబాటులోకి తేవడం తమ ఉద్దేశమన్నారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

ఈ కేంద్రంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ), ఐఐఐటీ, నల్సార్‌ల భాగస్వామ్యం ఉందని తెలిపారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

‘ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇవ్వటం లేదు. ఒకరకంగా చూస్తే టీ హబ్ ద్వారా ప్రభుత్వానికి నేరుగా దక్కే ప్రయోజనం లేదుగానీ... ఇప్పటికే ఐటీ రంగంలో పేరెన్నికగన్న హైదరాబాద్ స్టార్టప్‌ల రంగంలోనూ ఐకాన్‌గా మారుతుంది. అది మనకు గర్వకారణం' అని చెప్పారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

‘ఇక ఇక్కడి ఆవిష్కర్తలు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. తద్వారా తెలంగాణ బిడ్డలకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయి కదా' అని మంత్రి కెటిఆర్ వివరించారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

‘అత్యుత్తమ ఆలోచన కలిగి ఉండి, వ్యాపారపరంగా విజయవంతమయ్యే అవకాశం ఉంటే.. విద్యార్హతతో సంబంధం లేకుండానే స్టార్టప్‌లకు చోటు కల్పిస్తారు. వారి వారి అవసరాలకు తగినట్లు క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ ఇస్తారు. దీనికి టీ హబ్ నిర్దేశించిన ఛార్జీలుంటాయి' అని తెలిపారు.

టి హబ్-కెటిఆర్

టి హబ్-కెటిఆర్

‘స్టార్టప్‌లు టీ హబ్‌లో తమ కార్యకలాపాలకు కేటాయించిన సమయం వృథా పోకుండా ఐఎస్‌బీ ద్వారా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అందజేయనున్నాం' అని వివరించారు.

గవర్నర్‌కు ఆహ్వానం

గవర్నర్‌కు ఆహ్వానం

నవంబర్ 5న ప్రారంభోత్సవానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాలు ముఖ్య అతిథులుగా వస్తున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. వీరితోపాటు పారిశ్రామికవేత్తలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు ఇలా చాలామంది వస్తున్నారని చెప్పారు.

‘టీ హబ్ వెబ్‌సైట్ ఉంది. దాని ద్వారా ఆసక్తికలిగిన వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా కార్యాలయానికి నేరుగా వచ్చి ఆసక్తిని తెలియజేయవచ్చు. వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బృందం అర్హులను ఎంపిక చేస్తుంది' అని తెలిపారు.

‘అత్యుత్తమ ఆలోచన కలిగి ఉండి, వ్యాపారపరంగా విజయవంతమయ్యే అవకాశం ఉంటే.. విద్యార్హతతో సంబంధం లేకుండానే స్టార్టప్‌లకు చోటు కల్పిస్తారు. వారి వారి అవసరాలకు తగినట్లు క్యాబిన్ లేదా డెస్క్ స్పేస్ ఇస్తారు. దీనికి టీ హబ్ నిర్దేశించిన ఛార్జీలుంటాయి. స్టార్టప్‌లు టీ హబ్‌లో తమ కార్యకలాపాలకు కేటాయించిన సమయం వృథా పోకుండా ఐఎస్‌బీ ద్వారా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అందజేయనున్నాం' అని వివరించారు.

‘తెలంగాణలో ఐటీ వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 10 బిలియన్ డాలర్లు ఉన్న ఎగుమతుల సామర్థ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐటీ, ఐటీఈఎస్ రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. టీహబ్ రెండో ఫేజ్‌ను రాయదుర్గంలో విస్తరిస్తాం. గేమ్‌సిటీ సమీపంలోని 15 ఎకరాల్లో ఈ క్యాంపస్ ఏర్పాటవుతుంది. 3లక్షల ఎస్‌ఎఫ్‌టీల్లో ప్రస్తుత భవనానికి నాలుగున్నర రెట్లు ఫేజ్2 ఉంటుంది' అని తెలిపారు.

నవంబర్ 5న ప్రారంభోత్సవానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాలు ముఖ్య అతిథులుగా వస్తున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. వీరితోపాటు పారిశ్రామికవేత్తలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు ఇలా చాలామంది వస్తున్నారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+