Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కార్మికభీమా సొమ్ముపై కన్నెసిన కంత్రీ ముఠా: చనిపోయినవారికి కార్మిక గుర్తింపు కార్డులతో ఏం చేశారంటే!!

కార్మికుల కోసం ప్రభుత్వం అందించే పథకాలను వారికి చేరకుండా, ఆ పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా కాజేసే ముఠాలు తెలంగాణలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇక తాజాగా అటువంటి గ్యాంగ్ ని వరంగల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

నకిలీ గుర్తింపు కార్డులతో బీమా సొమ్ము స్వాహా చేత ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్

నకిలీ గుర్తింపు కార్డులతో బీమా సొమ్ము స్వాహా చేత ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్

నకిలీ చలాన్ లతో కార్మిక గుర్తింపు కార్డులు తీసుకుని తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పథకాల్లోని కార్మికుల బీమా సొమ్మునుస్వాహా చేసేందుకుపథక రచన చేసిన ఏడుగురు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ వర్ధన్నపేట, శాయంపేట, రాయపర్తి,ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు. ఈ ముఠా సభ్యుల నుండి డెత్ క్లెయిమ్ జిరాక్స్ దరఖాస్తు ఫారాలు, సీపీయూ, మానిటర్, కలర్ ప్రింటర్, ఒక సెల్ఫోన్, పదివేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కార్మికుల భీమా సొమ్ము కాజేయడానికి రంగంలోకి ముఠా

కార్మికుల భీమా సొమ్ము కాజేయడానికి రంగంలోకి ముఠా

ఈ అరెస్ట్ కుసంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక విభాగంలో పేరు నమోదుచేసుకోని గుర్తింపు కార్డు కలిగివున్న భవన నిర్మాణ కార్మికులకు చనిపోయిన సందర్భాల్లో ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ఈ సాయాన్ని అందజేసేందుకుగా ముందుగా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి ఆర్థిక సహాయాన్ని అందజేయాల్సి ఉంటుంది. కాని పరకాల సహయక కార్మిక అధికారిణి తన కర్తవ్యాన్ని విస్మరించి క్షేత్ర స్థాయిలో విచారణ జరపకుండాతన అల్లుడైన, ఈ కేసులో ప్రధాన నిందితుడైనభూమిహర్ భాస్కర్ తోఅనధికారకంగా విచారణ జరిపించడం తో సదరు అధికారిణి అల్లుడుభాస్కర్ ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు పథకంగా రూపొందించాడని సిపి తరుణ్ జోషి తెలిపారు. ఇందు కోసం నిందితుడు మిగితా నిందితులను వర్ధన్నపేట,రాయపర్తి, శాయంపేట, ఆత్మకూర్ ప్రాంతాల్లో ఏజెంట్లుగా నియమించుకుని తన ప్లాన్ వర్క్ అవుట్ చేశాడని పేర్కొన్నారు.

బీమా డబ్బుల కోసం మరణించిన వ్యక్తికి నకిలీ కార్మిక గుర్తింపు కార్డులు

బీమా డబ్బుల కోసం మరణించిన వ్యక్తికి నకిలీ కార్మిక గుర్తింపు కార్డులు


ప్రధాన నిందితుడుకార్మిక శాఖలో సభ్యత్వం లేని వ్యక్తులు ఏవరైనాఆయా గ్రామాల్లో ఆకస్మికంగా లేదా ప్రమాదవశాత్తు మరణించిన వారి సమాచారాన్ని ఏజెంట్ల నుండి సేకరించివారి కుటుంబ సభ్యులను కార్మిక శాఖ నుండి భీమా మొత్తాని ఇప్పిస్తామని వచ్చిన భీమా సొమ్ములో కొద్ది శాతం డబ్బు తీసుకుంటామని ఏజెంట్ల ద్వారా నమ్మించి వారి నుండి మరణించిన వ్యక్తికి సంబంధించి ఆధార్ మరియు ఇతర గుర్తింపు పత్రాలతో తీసుకోవడంతో పాటు బాధితుల ముఠా ఐదు నుండి పదివేలు రూపాయలునుండి వసూలు చేసేది.

కార్మిక బీమా డబ్బుల కోసం ముఠా ధరఖాస్తులు

కార్మిక బీమా డబ్బుల కోసం ముఠా ధరఖాస్తులు


ఇలా సేకరించిన పత్రాలతో ప్రధాన నిందితుడు గతంలో కార్మిక శాఖ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు కోసం కార్మికులు మీసేవలో చెల్లించిన రుసుము సంబంధించి
ఇతరుల రశీదులను సేకరించి ఆ రసీదు లోని తేది స్థానంలో పాత తేదీలతో మీ సేవలో చనిపోయిన వ్యక్తి పేరు మీద రుసుము చెల్లించినట్లుగా మీసేవ కేంద్రం రశీదు తరహలో నకిలీ రశీదు రూపొందించి మరణించిన వ్యక్తి ప్రస్తుతం జీవించి వున్నట్లుగా కార్మికశాఖలో దరఖాస్తు చేసి కార్మిక కార్డును పొందేవారు. కార్మిక శాఖ నుండి జారీ అయిన గుర్తింపు కార్డుల అధారంతో మరణించిన కార్మికుల భీమా సొమ్ము కొసంఈ ముఠా కార్మిక శాఖలో దరఖాస్తు చేసేవారు.

నకిలీ కార్మిక బీమా గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

నకిలీ కార్మిక బీమా గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు


ఇదే తరహలో ఈ ముఠా కార్మిక శాఖలో 29 దరఖాస్తులను అందజేసినట్లుగా సమాచారం. ఈ ముఠా కార్యకలపాలపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసుల సాయం నిందితులను అదుపులోకి తీసుకోని స్థానిక పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాల ద్వారా లబ్ది చేకూరుస్తామనిచెప్పి డబ్బులు వసూళ్ళ కుపాల్పడుతున్న వ్యక్తులను నమ్మవద్దని, ఇలాంటి వారి గురించి సమాచారం ఏదైనా వుంటే వరంగల్ కమిషనరేట్ వాట్సప్ నంబర్ 9491089257 కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+