దుబ్బాక పీఎస్ ఎదుట పురుగుల మందు తాగిన తల్లీకొడుకు: తల్లి మృతి

Subscribe to Oneindia Telugu

సిద్దిపేట: రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకున్న భూ వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది. ఆమె కొడుకును ఆస్పత్రిపాలు చేసింది. ఈ ఘటన జిల్లాలోని దుబ్బాకలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అంజమ్మ అనే మహిళ ఆమెకు చెందిన ఎకరం భూమిని మహారాష్ట్రలో ఉండే ఓ కుటుంబానికి గత కొంత కాలం క్రితం అమ్మేసింది. అయితే, ఇటీవల తన భూమిని మళ్లీ తాను కొనుగోలు చేస్తానంటూ వారితో మాట్లాడింది. ఇందుకు అంగీకరించిన వారు రూ. 60వేలు అడ్వాన్స్ గా తీసుకున్నారు.

land issue; son and mother attempted to commit suicide at Dubbaka PS

కాగా, గ్రామంలోని కొందరు అంజమ్మకు తిరిగి ఆ భూమిని అమ్మవద్దని, బయటి అమ్మితే ఇంకా ఎక్కువ రేటు వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ తీసుకున్న వారు భూమిని అమ్మేందుకు కొంత జాప్యం చేస్తున్నారు.

ఈ క్రమంలో గ్రామంలో పంచాయతీ నిర్వహించినా ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట అంజమ్మ, ఆమె కొడుకు ఆందోళన చేపట్టారు.

ఆవేశానికి లోనైన అజమ్మ కొడుకు అంజమ్మ నోట్లో విషం పోసి, తాను కూడా తాగాడు.
వారిని అడ్డుకున్న గ్రామస్తులు, వెంటనే ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అంజమ్మ మృతి చెందగా, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A son and mother attempted to commit suicide at Dubbaka PS on Friday. In this incident mother died.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి