ఉచిత బస్సు అమలు వేళ కొత్త కష్టాలు - ఆర్టీసీ కీలక నిర్ణయం, ఇక..!!
ఉచిత బస్సు పథకం అమలు వేళ కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ పథకం అమలు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ స్కీం ను మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించు కొంటున్నారు. ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. కాగా..అమలు లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కారం దిశగా ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. సీట్ల విషయంలోనూ స్పష్టత ఇచ్చింది. కాగా.. తెర పైకి కొత్త సమస్యలు వచ్చాయి. దీంతో.. ఆర్టీసీ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం అమలు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఆర్టీసీ యాజమాన్యం సైతం ఈ పథకం నిర్వహణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కొత్తగా ఈ పథకం కోసం మహిళలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక నుంచి ఆధార్ చూపించాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ కార్డులతో మహిళలు ప్రయాణం చేసేలా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా ఎలక్ట్రిక్ బస్సు ల్లోనూ ఈ పథకం విస్తరణ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఉచిత బస్సుల్లో పురుషులకు సీట్ల కేటాయింపు పైన చర్చ ..పలు ప్రాంతాల్లో రచ్చ జరుగుతోంది. దీని పైనా తాజాగా ఆర్టీసీ అధికారులు స్పష్టత ఇచ్చారు. పురుషుల కోసం ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం వినియోగిస్తున్న వేళ.. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లలో మహిళా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది.
హైదరాబాద్ పరిధిలోని రద్దీ మార్గాల్లో కనీసం బస్సుల్లో నిల్చొని ప్రయాణించడానకీ వీలులేని పరిస్థితులు వచ్చాయి. ప్రయాణికుల రద్దీకి అనుగణంగా బస్సుల సంఖ్య పెరగకపోవడం పెద్ద సమస్యగా మారింది. మహాలక్ష్మీ పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య నేటితో పోల్చుకుంటే గణనీయంగా పెరిగింది. ఇంతటి రద్దీతో వాహనాన్ని నడపటం బస్సు డ్రైవర్‌తో పాటు టికెట్లు పంపిణీ చేసే కండక్టర్లకూ ఇబ్బందిగా మారింది. నగరంలోని పలు చోట్ల బస్సుల్లో ప్రయాణించాలంటే నానా ఇక్కట్లు తప్పడం లేదు.
గ్రేటర్ పరిధిలో 2,996 బస్సులతో 32 వేల ట్రిప్పులు నడుపుతుండగా వేర్వేరు మార్గాల్లో వాటి సంఖ్య పెంచాలని, ట్రాఫిక్ కూడళ్లను దాటవేస్తూ నేరుగా గమ్యం చేర్చేలా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుత అవసరాల దృష్ట్యా 7 వేలకు పైగా బస్సులు అవసరమవుతుండగా ఉన్నవాటితోనే సర్దుబాటు చేయడం సవాల్‌గా మారింది. అయితే, కొత్త బస్సుల ఏర్పాటు ఆర్టీసీకి సమస్యగా మారటంతో.. ప్రస్తుతం ఉన్న వాటితోనే నెట్టుకొస్తోంది. దీంతో.. సాధారణ ప్రజలు ఆర్టీసీ సానుకూల నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications