వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిడ్ మానేరు ముంపుబాధితులపై లాఠీచార్జ్: కేసీఆర్ పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి మాటలదాడి!!

|
Google Oneindia TeluguNews

కాళేశ్వరం ప్రాజెక్టుకు మిడ్ మానేరు డ్యామ్ గుండెకాయ లాంటిదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే, మిడ్ మానేర్ డ్యాం ముంపు గ్రామాల బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదని మిడ్ మానేరు నిర్వాసితులు వేములవాడ నంది కమాన్ దగ్గర మహాధర్నా చేపట్టారు. దీనికి నిర్వాసితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కేసీఆర్.. దమ్ముంటే మునుగోడులో పోటీ చెయ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్!!కేసీఆర్.. దమ్ముంటే మునుగోడులో పోటీ చెయ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్!!

 వేములవాడలో మిడ్ మానేరు నిర్వాసితుల ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్

వేములవాడలో మిడ్ మానేరు నిర్వాసితుల ఆందోళన, పోలీసుల లాఠీ చార్జ్

ఇక మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతుగా నిలిచి వారితో పాటు పోరాటం చేపట్టాయి. ఇక వేములవాడలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసుల తీరుతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కెసిఆర్ ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాధితులు చేపట్టిన ఆందోళన అడ్డుకున్న పోలీసులు, బాధితులపై లాఠీఛార్జి చేశారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 మహిళలని కూడా చూడకుండా అరెస్టు చేస్తారా: మండిపడిన బండి సంజయ్

మహిళలని కూడా చూడకుండా అరెస్టు చేస్తారా: మండిపడిన బండి సంజయ్


ఇక ఈ క్రమంలో మిడ్ మానేరు నిర్వాసితుల పరిహారం విషయంలో పోలీసుల తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలను, బీజేపీ నేతల అక్రమ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళలని కూడా చూడకుండా అరెస్టు చేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ముంపు గ్రామాల బాధితులపైన కూడా పోలీసులు లాఠీఛార్జి చేయడం దుర్మార్గమని బండి సంజయ్ పేర్కొన్నారు.

వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవి .. తక్షణం పరిష్కరించాలన్న బండి సంజయ్

వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవి .. తక్షణం పరిష్కరించాలన్న బండి సంజయ్


మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం భూములను, ఆస్తులను త్యాగం చేసిన బాధితులని కూడా చూడకుండా వారిని అరెస్టు చేయడం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. బాధితుల సమస్యలను పరిష్కరిస్తే ఆందోళన చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా అంటూ బండి సంజయ్ నిలదీశారు. మిడ్ మానేరు బాధితుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, వారికి బిజెపి పూర్తిగా అండగా ఉంటుందని బండి సంజయ్ వెల్లడించారు. బాధితుల డిమాండ్లను తక్షణం ప్రభుత్వం పరిష్కరించాలని, తక్షణమే అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ మిడ్ మానేరు బాధితుల డిమాండ్లను పరిష్కరించలేదు: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ మిడ్ మానేరు బాధితుల డిమాండ్లను పరిష్కరించలేదు: రేవంత్ రెడ్డి


ఇక మిడ్ మానేరు నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం కోసం వేములవాడలో ధర్నా చేస్తున్న నిర్వాసితుల పై పోలీసుల దౌర్జన్యం దుర్మార్గమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న నిర్వాసితుల అరెస్టులను ఖండిస్తున్నానని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హౌస్ అరెస్టును ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన, అరెస్టు చేసిన నిర్వాసితులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ హామీ ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి సూచించారు.

English summary
Bandi Sanjay and Revanth Reddy verbally attacked CM KCR as the police lathi-charged the Mid manair dam flood victims. KCR did not fulfill his promises to the residents, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X