అవమానిస్తున్నారు, చంద్రబాబు సాక్షి, పిచ్చికూతలు కూస్తే: లక్ష్మీపార్వతి హెచ్చరిక
ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎన్టీఆర్ సతీమణి, వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు.
హైదరాబాద్: ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎన్టీఆర్ సతీమణి, వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు.
చదవండి: 'బిజెపితో టచ్‌లో నేతలు, ఏపీపై మోడీ దృష్టి': బాబుకు షాకిస్తారా?

ఎన్టీఆర్ జీవితంలోని మలుపులు చూపిస్తానని ప్రకటన
లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ జీవితచరిత్రను తెరకెక్కిస్తున్నట్లు వర్మ ప్రకటించారు. ఎన్టీఆర్ జీవితంలోని పలు మలుపులను తెరపై చూపిస్తానంటూ ఆయన చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఇప్పటికే పలువురు వర్మను టార్గెట్ చేశారు.

నా అనుమతి అవసరం
లక్ష్మీపార్వతి కూడా దీనిపై మాట్లాడారు. ఎన్టీఆర్ పైన సినిమా తీయాలంటే భార్యగా తన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె వెల్లడించారు. కుమారుల అనుమతి అవసరం లేదని అన్నారు. తమ ఇద్దరిపై తీసే సినిమాకు తానే అనుమతిని ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

చంద్రబాబు ప్రత్యక్ష సాక్షి
తాను ఎన్టీఆర్ భార్యను కాదంటూ పదే పదే అవమానిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రత్యక్ష సాక్షి అన్నారు. ఎన్టీఆర్ పై కచ్చితంగా సినిమా రావాల్సిందే అన్నారు.

పిచ్చికూతలు కూస్తే
అయితే, ఎన్టీఆర్ జీవిత చరిత్రను సరైన రీతిలో చూపిస్తేనే తాను సహిస్తానని, పిచ్చి రాతలు, పిచ్చి కూతలు చూపిస్తే తానే ఎదురు తిరుగుతానని హెచ్చరించారు. ఎన్టీఆర్ వాదన, వేదనను చూపిస్తేనే మద్దతు ప్రకటిస్తానన్నారు.












Click it and Unblock the Notifications