హైదరాబాద్ కు కేంద్రం గుడ్ న్యూస్- డబుల్ డెక్కర్ కారిడార్ కు ఆమోదం..!!
హైదరాబాద్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దిల్లీలో కేంద్రమంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై భేటీలో కీలక అంశాల పైన చర్చించారు. ఎల్బీనగర్-హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు.
తెలంగాణలో కీలక మౌలిక వసతులు.. ప్రాజెక్టుల పై కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. నవంబర్ 19-22 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న 'ఇండియన్ రోడ్ కాంగ్రెస్' (IRC) సదస్సుకు హాజరు కావాలని కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించగా, వారు తప్పక వస్తానని హామీ ఇచ్చారు. ఎల్బీనగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం తెలిపిన గడ్కరీ మరి కొన్ని అంశాలకు అంగీకరించారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో NH 167kపై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అనుసంధానం జరిగితే, రవాణా వ్యవస్థ, పర్యాటకం మెరుగుపడ నుందని కోమటిరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ - శ్రీశైలం NH 765పై ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంపై నూతన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు కేంద్రమంత్రి ఆదేశించారు.

గడ్కరీతో కోమటిరెడ్డి చర్చల ఫలితం
అదే విధంగా పర్వతమాల పథకం ద్వారా తెలంగాణకు 5 రోప్‌వేలకు నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. హైదరాబాద్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. సేతు బంధన్ పథకం ద్వారా 3 ఆర్ఓబీలకు నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. తెలంగాణలో 34 పనులకు సీఆర్ఐఎఫ్ (CRIF) నిధులను మంజూరు చేయాలని కోమటిరెడ్డి కోరగా కేంద్ర అధికారులను నితిన్ గడ్కరీ ఆదేశించారు. పుల్లూరు - అలంపూర్ - జట్రపోలు - పెంట్లవెల్లి - కొల్లాపూర్ - లింగాల - అచ్చంపేట - డిండి - దేవరకొండ - మల్లేపల్లి - నల్గొండ రాష్ట్ర హైవేలను జాతీయ హైవేలుగా మార్చాలని కోమటిరెడ్డి కోరడంతో సానుకూలంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.













Click it and Unblock the Notifications
