రేపు హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి, అప్పుడే గ్రేటర్లో టిడిపిలోకి చేరికలు!
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాదుకు రానున్నారని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆయన ఏ1గా ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయనకు గతంలో బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం... కొడంగల్ నియోజకవర్గాన్ని దాటి రావొద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఆయన తన సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యారు. తాజాగా, మంగళవారం న్యాయస్థానం ఆయనకు భారత దేశంలో ఎక్కడైనా తిరిగేలా షరతులు సడలించింది.

అయితే, ప్రతి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఎసిబి కార్యాలయానికి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొడంగల్‌లో ఉన్న ఆయన బుదవారం నాడు హైదరాబాద్ రానున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్న నేపత్యంలో వలసల పర్వం ప్రారంభం అవుతోంది. ఎల్పీ నగర్ పరిధిలోని టిఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులతో పాటు కాంగ్రెస్ మైనార్టీ నేత బుధవారం టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సమక్షంలో వారు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. బుధవారం మధ్యాహ్నం వారు సైకిల్ ఎక్కనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయం
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందజేస్తోంది. ప్రభుత్వం ఇవాళ మరో 12 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు రూ. కోటి 20 లక్షలు విడుదల చేసింది. మహబూబ్‌నగర్ -1, నిజామాబాద్ -2, వరంగల్ -3, నల్గొండలో 6 కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications