నయీం దందాల్లో బినామీల చిక్కులు: ఎందుకో, ఏమిటో తెలియదు, చేశారంతే...

హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీంతో అంటకాగిన భూములు పొందిన రాజకీయ నేతలు, పోలీసు అధికారులు తమకు సన్నిహితులైనవారి పేర్ల మీద భూములను రిజిస్టర్ చేయించినట్లు తేలింది. రాజకీయ నాయకులకు, పోలీసు అధికారులకు వారు బినామీలుగా వ్యవహరించారు.

అయితే, బినామీలకు ఆ భూములు ఎక్కడున్నాయో, ఎందుకు తమ పేరు మీద రిజిస్టర్ చేశారో తెలియదు. తమ వాళ్లు చెప్పడమే తరువాయి వివరాలేమీ అడకుండా సంతకాలు చేసి తమ పేర్ల మీద భూములు రిజిస్టర్ చేయించుకున్నారు. నయీం వ్యవహారాలు బయటపడడంతో వారు చిక్కుల్లో పడాల్సి వచ్చింది.

ఇప్పటివరకు వెలుగు చూసిన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల బినామీలు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు ఇచ్చిన వాంగ్మూలాలను పరిశీలిస్తే ఆ విషయం తెలిసి వస్తుంది. అందుకు సంబంధించిన వివరాలు బుధవారం మీడియాలో వచ్చాయి. ఆ బినామీలు ఇచ్చిన వాంగ్మూలాలు ఇలా ఉన్నాయి.

Leaders and police land dealings with Nayeem

యూసుఫ్‌..

నా పేరు యూసఫ్‌. ప్రైవేటు లారీ ట్రాన్సపోర్టు ఫోర్‌మెనగా భువనగిరిలో చేస్తున్నాను. భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామంలో కరెంటు పోల్స్‌ తయారీ కంపెనీలో పనిచేసేందుకు కూలీలను పంపిస్తుంటాను. నా పెద్ద కూతురు రహత భానును 37 సంవత్సరాల క్రితం నల్లగొండకు చెందిన ఎస్సై మస్తాన అలీకి ఇచ్చి వివాహం జరిపించాం. అతను ప్రస్తుతం సంగారెడ్డి ట్రాఫిక్‌ సీఐగా పనిచేస్తున్నారు. 2008లో బొమ్మాయిపల్లిలో ఎకరా భూమి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పిన మస్తాన్ - నా పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తర్వాత దాన్ని తన పేరున మార్చుకుంటానని చెప్పారు.

గండికోట మల్లికార్జున్...

మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి సీఐగా పని చేస్తున్న గండికోట వెంకటయ్య మా నాన్న సొంత తమ్ముడు. 2008లో నేను మలక్‌పేటలోని శ్రీవాణి విద్యానికేతన్‌లో ఇంటర్‌ చదువుతుండగా అప్పుడు మా బాబాయ్‌ ఎస్సైగా పనిచేస్తుండేవాడు. ఒకరోజు బాబాయ్‌ ఫోన్ చేసి, నిన్ను కలిసేందుకు ఓ వ్యక్తి వస్తాడు. అతను అడిగినవి తీసుకుని వెంట వెళ్లమని చెప్పాడు. బాబాయ్‌ చెప్పినట్లు వారితో స్కార్పియో కారులో భువనగిరికి వెళ్లాను. అక్కడ నా పేరుమీద ఒక ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చేశారు. నా సంతకం, వేలిముద్రలు తీసుకున్నారు. ఆ భూమి ఎక్కడ ఉందనే విషయం నాకు తెలియదు.

వెలగపుడి శివరామప్రసాద్‌

నాది కృష్ణా జిల్లా ఉర్దూర్‌ గ్రామం. 2003లో కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాను. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాను. 2008లో గెట్‌ టు గెదర్‌ పార్టీలో నాదెళ్ల చంద్రప్రసాద్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. చంద్రప్రసాద్‌తో కలిసి శంషాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయగా మంచి లాభాలు వచ్చాయి. 2008లో పోలీస్‌ అధికారి మలినేని శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. ఆయన తన భూములను నా పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు.

మామిడి నర్సింహా స్వామి

వరంగల్‌ జిల్లా ములుగు ఘనపూర్‌ నా సొంత గ్రామం. నా సొంత బావమరిది బూర రాజ్‌గోపాల్‌ (భార్య తమ్ముడు) ఎస్సైగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. 2008 ఆగస్టులో నా బావమరిది ఫోన్ చేసి భువనగిరికి చెందిన వెంకట రెడ్డి తనకి ఒక ఎకరా భూమి ఇస్తానని చెప్పాడని, దాన్ని నా పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తర్వాత తన పేరున మార్చుకుంటానని చెప్పాడు. రెండు, మూడు రోజులకు వెంకటరెడ్డి నాకు ఫోన్ చేసి నన్ను రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లి ఎకరా భూమి రిజిస్ట్రేషన్ చేయిస్టున్నట్లు సంతకాలు చేయించాడు.

కొత్తూరు వెంకట రామయ్య

వరంగల్‌ జిల్లా గోవిందరావుపేట మా ఊరు. కొత్తపల్లి ప్రసాద రావు నాకు వరుసకు అన్న అవుతాడు. కొత్తపల్లి శివప్రసాదరావుకు చిన్ననాటి స్నేహితుడైన సాయి మనోహర్‌ ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్నాడు. 2008లో భువనగిరిలో ఒక ఎకరా భూమి తనకు వస్తుందని చెప్పిన సాయిమనోహర్‌ దాన్ని నా పేరిట రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ధర వచ్చినప్పుడు అమ్ముకుంటానని చెప్పాడు. 2008 ఆగస్టు 18న నా పేరుమీద ఒక ఎకరా, తీగల శోభనరావు పేరుమీద 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించారు.

గంగసాని రవీందర్‌ రెడ్డి

వరంగల్‌ జిల్లా కుందారం మా స్వగ్రామం. కుటుంబంతో కలిసి 2004 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాను. మా అమ్మ అమృతాదేవి. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ భార్య కమల, మా అమ్మ సొంత అక్కాచెల్లెళ్లు. నేతి విద్యాసాగర్‌ నాకు బాబాయ్‌ అవుతాడు. నేను తరచూ హైదరాబాద్‌లోని నేతి విద్యాసాగర్‌ ఇంటికి వెళ్తుండేవాడిని. సుమారు ఏడేళ్ల కిందట విద్యాసాగర్‌ ఇంటికి వెళ్లినప్పుడ భువనగిరి మండలం బొమ్మాయిపల్లిలో పది ఎకరాల భూమి తనకు వచ్చిందని, ఆ భూమిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పాడు.

పాస్‌పోర్టు సైజు ఫొటో, ఐడీ కార్డుతో భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే అక్కడ మనవాళ్లు మిగతా విషయాలు చూసుకుంటారని చెప్పారు. నాతోపాటు విద్యాసాగర్‌ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న నాగయ్య పేరున ఐదెకరాలు రిజిస్ట్రేషన్ చేయించాడు. 2008 ఆగస్టు 21న ఇది భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగింది.

పి. నాగయ్య

నేతి విద్యాసాగర్‌ది మా ఊరే. 15 ఏళ్లుగా నకిరేకల్‌లోని వారి ఇంట్లోనే ఉంటున్నాను. మా తమ్ముడు రమేశ్‌ నేతి విద్యాసాగర్‌ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మా సారు విద్యాసాగర్‌ హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు ఆయనతోపాటే వెళ్తుంటాను. ఆయన చెప్పిన పనులు చేస్తుంటాను. 2008లో మేం హైదరాబాద్‌లో ఉండగా ఒకరోజు మా సార్‌ నన్ను, వాళ్ల వదిన కొడుకు రవీందర్‌ రెడ్డిని పిలిపించారు. నన్ను అతని వెంట భువనగిరి రిజిస్ట్రేషన ఆఫీసుకెళ్లి సంతకాలు పెట్టి రమ్మని చెప్పాడు. అక్కడ పదెకరాల భూమి నా పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించారు.

వై.నాగేంద్రప్రసాద్‌

నాది నిజామాబాద్‌ జిల్లా బాచుపల్లి. వ్యవసాయ భూమి అమ్మి పాశమైలారంలో గ్రానైట్స్‌ పాలిషింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేసుకుని వ్యాపారం మొదలుపెట్టాను. వ్యాపారంలో భాగంగా పోలీస్‌ అధికారి మద్దిపాటి శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. పోలీస్‌ అధికారితో పరిచయం ఉంటే వ్యాపారంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అతనితో పరిచయం పెంచుకుని కలుస్తుండేవాడిని. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగంగా వెలగపూడి శివరామప్రసాద్‌, చంద్రప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. 2008లో ఆగస్టులో మద్దిపాటి శ్రీనివాస్‌ నన్ను పిలిచి, భువనగిరిలో స్థలం కొనుగోలు చేస్తున్నానని, దానిని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తర్వాత తన పేరిట మార్చుకుంటానని అన్నారు.

బీరం మధుకర్‌ రెడ్డి

1991 - 2000 మధ్య యూత్ కాంగ్రెస్ లో తిరిగాను. అదే సమయంలో చింతల వెంకటేశ్వర రెడ్డితో పరిచయం ఏర్పడింది. వెంకటేశ్వర రెడ్డి 2008 ఆగస్టులో ఫోన్ చేసి భువనగిరి మండలం బొమ్మాయిపల్లి గ్రామంలో పది ఎకరాలు భూమి తాను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. ఆ భూమిని నా పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత తన పేరుమీద మార్చుకుంటానని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+