మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్​ షాప్​ లు బంద్..

మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మార్చి 27న ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం షాపులు బంద్ కానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

మార్చి 27 శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు బంద్ కానున్నాయి. వైన్స్ తో పాటుగా బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ ఉంటాయని.. పండగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక శ్రీరామనవమి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండగ. శ్రీరామనవమి వేడుకలు హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్ మహానగరంలో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. దాంతో పోలీసులు నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నగరంలో 12 గంటలపాటు అంటే శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

LiquorShops to Remain Closed Across Telangana Including Hyderabad on March 27 SriRama Navami Yatra

హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభం అవుతుంది. కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగుతుంది. ఈ క్రమంలో బేగంబజార్‌, అఫ్జల్‌ గంజ్‌, ఎంజి మార్కెట్‌, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లో వాహనాల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ చర్యలు చేపట్టేందుకు హైదరాబాద్‌ పోలీసులు సిద్ధం అయ్యారు. మూడు వేల మంది సిబ్బంది, డోన్లు, సీసీకెమెరాలతో శోభాయాత్ర మార్గంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+