వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎల్లుండి పోలింగ్, టీవీ, రేడియోల్లో ప్రచారం నిషేధం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక సమరం ప్రచారం ముగిసింది. ఈసారి టీవీలు, రేడియోల్లో ప్రచారం నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండొద్దని స్పష్టంచేసింది.

పోలింగ్‌కు ఏర్పాట్లు ..
తొలి విడత 2166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం జారీచేసింది. అయితే 69 స్థానాలు ఏకగ్రీవం అవడంతో 2097 చోట్ల సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఇక జెడ్పీటీసీ విషయానికొస్తే 197 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా రెండుచోట్ల ఏకగ్రీవం కావడంతో 195 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఒకటి, జగిత్యాల జిల్లా కోరుట్ల జెడ్పీటీసీ ఏకగ్రీవం కావడంతో మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహిస్తారు.

local body election first phase monday polling

సర్వం సిద్ధం ..
ఈ నెల 6 సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు సమయం నిర్దేశించారు. అయితే క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిస్తామని ఎన్నికల అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

English summary
The first phase of the Telangana state local campaign ended. The state election commission has said that campaigns on TVs and radio have been banned this time. It is clear that there should be no locals in the polling areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X