పెట్రోలింగ్ వాహనంపైకి దూసుకెళ్లిన లారీ: పోలీసులకు తీవ్రగాయాలు(ఫొటోలు)

హైదరాబాద్‌: నగరంలోని హయత్‌నగర్‌ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది.

Lorry crashes with police vehicle

లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. లారీ ముందు భాగం దెబ్బతినడంతో క్రేన్‌ సాయంతో దానిని పక్కకు తరలించారు.

Lorry crashes with police vehicle

మెదక్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా: 20మందికి గాయాలు

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ మండలం నర్సాపూర్‌ ఈరోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్‌ నుంచి నారాయణఖేడ్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+