ఊపిరితిత్తులు హైద్రాబాద్ టు చెన్నై: బెజవాడ వ్యక్తికి ఊపిరిపోసిన హైదరాబాదీ
హైదరాబాద్: విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్ వాసి ఊపిరిపోశాడు. భాగ్యనగరంలో ఆదివారం నాడు గణేష్ నిమజ్జనం రద్దీలోను పోలీసులు ఓ జీవన్మృతుడి ఊపిరితిత్తులను మూడు గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించారు.
విజయవాడకు చెందిన 35 ఏళ్ల ఓ వ్యక్తి వ్యాపారి. ఆన చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. విజయవాడలో వైద్యులు చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరాలని అతనికి సూచించారు.
చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో చేరిన అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని నిర్ణయించారు.

రోగి ఆరు అడుగుల పొడవు ఉండటంతో అతడికి సరిపోయే పరిమాణంలో ఊపిరితిత్తులు లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో 21 ఏల్ల ఇంజినీరింగ్ విద్యార్థి సాగర్ బాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయన జీవన్మృతిడిగా ఉన్నాడు.
అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. హైదరాబాదులోని ఎల్బీ నగర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు చెన్నై గ్లోబల్ ఆసుపత్రికి సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉధయం ఊపిరితిత్తులను సేకరించి చెన్నైకి తరలించారు.
16 మంది వైద్యుల బృందం మూడు గంటల పాటు శ్రమించి ఊపిరితిత్తుల మార్పిడీని విజయవంతం చేసింది.చెన్నై గ్లోబల్ ఆసుపత్రికి చెందిన టీమ్ శనివారం రాత్రి హైదరాబాద్ వచ్చింది. అనంతరం తిరిగి ఆదివారం ఉదయం 4.30 గంటలకల్లా చెన్నైకి ప్రత్యేక విమానంలో వచ్చారు.












Click it and Unblock the Notifications