‘తనదాక వచ్చిందనే నయీం ఎన్‌కౌంటర్: కేవీపీతో కేసీఆర్ వ్యాపారాలు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కీ. ఆయన సోమవారం మాట్లాడుతూ.. కెసిఆర్ పాలనే తెలంగాణకు అరిష్టమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వమే నెంబర్‌గా నిలుస్తోందని ఎద్దేవా చేశారు. అంతేగాక, మిషన్ భగీరథ దేశంలోనే పెద్ద కుంభకోణమని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సన్న బియ్యం, నల్లా నీళ్ల కోసమే వచ్చిందా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ బిడ్డ కవిత లాండ్ సెటిల్మెంట్లు, అల్లుడు ఇసుక దోపిడీ , కొడుకు ప్రత్యేక విమానాల్లో షికారు చేస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రతో ఒప్పందం జరిగిపోయినట్లు గతంలో ప్రచారం చేసిన టిఆర్ఎస్ నేతలను గాడిదలపై ఊరేగించాలని అన్నారు.
సీఎం కేసీఆర్ సన్నిహితులతో సెటిల్మెంట్ చేసినందుకే నయీంను ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపించారు. అంతేగాక, కేసీఆర్.. కుల గజ్జితోనే కేవీపీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కేవీపీతో కేసీఆర్ ఫ్యామిలీ బినామీ వ్యాపారాలు చేస్తోందని ఆరోపించారు. కేవీపీపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications