Kavitha: షర్మిలపై విరుచుకుపడ్డా కవిత.. పాదయాత్ర కాకపోతే మోకాళ్ల యాత్ర చేసుకో అంటూ ఎద్దేవా..
షర్మిలపై ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో కొనసాగుతోంది. ఆమె పాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. షర్మిల విమర్శలను బీఆర్ఎస్ నేతలు దాటిగా తిప్పి కొడుతున్నారు.

మాలోత్ కవిత
షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత హెచ్చరించారు. ఎం కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. షర్మిల పాదయాత్ర కాకపోతే మోకాళ్ల యాత్ర చేసుకోవాలని ఎద్దేవా చేశారు. కానీ సీఎం కేసీఆర్ ను తిడితే మాత్రం చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బూట్లు
గిల్లికజ్జాలు పెట్టుకోవాలని చూసే బుద్ధిని షర్మిల మార్చుకోవాలన్నారు. వైఎస్ షర్మిల చెప్పుల దుకాణం యజమాని లాగా మాట్లాడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు బూట్లు కొనిచ్చేంత పెద్దదానివా అంటూ మండిపడ్డారు.కాస్త నోటి దురుసు తగ్గించుకో అంటూ సూచన చేశారు.

పులివెందుల
తాను పులివెందులకు వస్తానని.. అక్కడ మీ అన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కదా.. మరి మీ అన్న నాతో వస్తాడా అంటూ సవాల్ విసిరారు. మీ నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడని, ఎప్పుడూ నీలా చిల్లర మాటలు మాట్లాడలేదన్నారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామని పాదయాత్ర చేసుకోవచ్చని పేర్కొన్న ఆయన, నిరాధారమైన, అసత్యమైన, వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు .












Click it and Unblock the Notifications