అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్‌తో జాయిన్ అవుతా, కాపు పార్టీ.. ఆలోచించు: చివరకు మహేష్ కత్తి ప్రశంస

|
Google Oneindia TeluguNews

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంపై మహేష్ కత్తి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వరుసగా ట్వీట్లు చేశారు. గుంటూరు నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగిన జనసేన నాలుగో ఆవిర్భావ వేడుకలో జనసేనాని మాట్లాడిన విషయం తెలిసిందే.

చదవండి: చంద్రబాబు-లోకేష్‌లపై పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు

దీనిపై మహేష్ కత్తి మాట్లాడారు. వరుసగా ట్వీట్లు చేశారు. పవన్ పైన ప్రశంసలు కురిపిస్తేనే కాపులకు రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మద్దతు వచ్చిన అంశాన్ని ఆలోచించాలని సూచన చేశారు.

చదవండి: ఎన్టీఆర్ తర్వాత.. తెలుగోడి దెబ్బ: మోడీకి పవన్ వార్నింగ్, ఆమరణదీక్ష అవసరమొస్తుందా?

పవన్ కళ్యాణ్‌తో జాయిన్ అవుతా

ప్రత్యేకహోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తే తాను కూడా జాయిన్ అవుతానని మహేష్ కత్తి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌కు అభినందనలు

పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని స్వాగతిస్తున్నానని, చాలా విలువైన నిర్ణయాలు జనసేన అధినేత పవన్ తీసుకున్నారని మహేష్ కత్తి అన్నారు. నిజంగా ఆయనకు అభినందనలు అన్నారు.

పవన్ ఆలోచన చేయాలి

దళితులకు ఉపాధి కల్పన, వ్యాపార అవకాశాలు అన్నప్పుడు రాని శబ్దం, కేకలు కాపు రిజర్వేషన్లు అనే సరికీ ఎందుకు వచ్చిందో, ఒకసారి పవన్ ఆలోచించుకోవాలని మహేష్ కత్తి సూచించారు. ఇప్పటికి ఒక్క దళిత రెప్రజెంటేటివ్ జనసేనలో లేకపోవడాన్ని కూడా గమనించాలని, జనసేన కాపు పార్టీ అని ఎందుకు ముద్రపడిందో తెలుస్తుందన్నారు.

ఎన్నికల లక్ష్యం

పవన్ ప్రసంగం అయిపోయే సమయానికి అభినందనలు తెలిపిన మహేష్ కత్తి అంతకుముందు జనసేనానిపై సెటైర్లు వేశారు. ఈ సమస్యలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే బాగుండేదని, ఇన్నాళ్లు లెక్కగట్టి ఈరోజు అప్పజప్పడం వల్ల ఏమి లాభమని, ఎన్నికల లక్ష్యం కోసమే ఇలా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు.

English summary
Mahesh Kathi on Jana Sena chief Pawan Kalyan guntur speech in Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X