దైవ సంకల్పంతో మంచిరోజులు, ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు: చినజీయర్‌స్వామి(పిక్చర్స్)
హైదరాబాద్: దైవ సంకల్పంతో దేశానికి మంచి రోజులు వచ్చాయని, మంచి పాలకులు వచ్చారని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. మంచి కార్యానికి తెర లేచిందని ఆయన పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆదివారం నగరంలోని నిజాం కళాశాల మైదానంలో హిందూ చైతన్య సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రసంగించారు.
‘ఇతర మతాల ఉనికిని, గతిని మనం ప్రశ్నించడం లేదు. ఈ దేశంలో పుట్టిన వ్యక్తి ఎవరినీ వేలెత్తి చూపడంగానీ, ఆక్షేపించడం కానీ చేయడు. అయితే, మరొకరు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వడం కూడా తగదు' అని త్రిదండి చినజీయర్ స్వామిజీ హితవు పలికారు. 'నీ దైవాన్ని నీవు ఆరాధించుకో. నీదికాని దానిని వేలెత్తి చూపకు. గౌరవించడం నేర్చుకో' అని చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ సందర్భంగా వినాయకుడి ఉత్సవాలు, నిమజ్జనం విశిష్టతను వివరించారు. విజ్ఞానం, సైన్స్.. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండటం లేదన్నారు. ఈ రోజు అవును అన్నదాన్ని రేపు వారే ఖండిస్తున్నారు. అలాంటి నిలకడ లేని శాస్త్రాలను ఆధారంగా చేసుకొని దేవతా స్వరూపాల విధానాలను నిరూపణ చేసే ప్రయత్నం తగదని అన్నారు.
దైవ శక్తిని భక్తిపూర్వక విధానంలో తీసుకోవడమే ఉత్తమమని సూచించారు. గణేశ్ మండపాలను శ్రద్ధగా నిర్వహించాలని హితవు పలికారు. ఈ సమయంలో తేలికపాటి వర్షం కురవడంతో మనం చేసే పని దైవానికి ఇష్టమైందని, అందుకే వరుణ దేవుడు పలుకరించి వెళ్ళాడని అన్నారు. ఒక మతం వారు పుస్తకం పట్టుకుని ప్రార్థనా మందిరానికి వెళుతున్నారని, మనం ఆలయాలకు ఎందుకు వెళ్ళడం లేదని అన్నారు.

హిందూ చైతన్య సభ
దైవ సంకల్పంతో దేశానికి మంచి రోజులు వచ్చాయని, మంచి పాలకులు వచ్చారని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. మంచి కార్యానికి తెర లేచిందని ఆయన పేర్కొన్నారు.

హిందూ చైతన్య సభ
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆదివారం నగరంలోని నిజాం కళాశాల మైదానంలో హిందూ చైతన్య సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రసంగించారు.

హిందూ చైతన్య సభ
‘ఇతర మతాల ఉనికిని, గతిని మనం ప్రశ్నించడం లేదు. ఈ దేశంలో పుట్టిన వ్యక్తి ఎవరినీ వేలెత్తి చూపడంగానీ, ఆక్షేపించడం కానీ చేయడు. అయితే, మరొకరు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వడం కూడా తగదు' అని త్రిదండి చినజీయర్ స్వామిజీ హితవు పలికారు.

హిందూ చైతన్య సభ
'నీ దైవాన్ని నీవు ఆరాధించుకో. నీదికాని దానిని వేలెత్తి చూపకు. గౌరవించడం నేర్చుకో' అని చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

హిందూ చైతన్య సభ
విజ్ఞానం, సైన్స్.. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండటం లేదన్నారు. ‘ఈ రోజు అవును అన్నదాన్ని రేపు వారే ఖండిస్తున్నారు. అలాంటి నిలకడ లేని శాస్త్రాలను ఆధారంగా చేసుకొని దేవతా స్వరూపాల విధానాలను నిరూపణ చేసే ప్రయత్నం తగదు' అని అన్నారు.

హిందూ చైతన్య సభ
దైవ శక్తిని భక్తిపూర్వక విధానంలో తీసుకోవడమే ఉత్తమమని సూచించారు. గణేశ్ మండపాలను శ్రద్ధగా నిర్వహించాలని హితవు పలికారు. ఈ సమయంలో తేలికపాటి వర్షం కురవడంతో మనం చేసే పని దైవానికి ఇష్టమైందని, అందుకే వరుణ దేవుడు పలుకరించి వెళ్ళాడని అన్నారు.

హిందూ చైతన్య సభ
ఒక మతం వారు పుస్తకం పట్టుకుని ప్రార్థనా మందిరానికి వెళుతున్నారని, మనం ఆలయాలకు ఎందుకు వెళ్ళడం లేదని అన్నారు.

హిందూ చైతన్య సభ
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పూర్థ్వకుండాన్ని, శంఖు-చక్రాలను అమర్చిన శ్రీ రామానుజల వారికి 2017వ సంవత్సరానికి వెయ్యి సంవత్సరాలు రానున్నాయని ఆయన తెలిపారు.

హిందూ చైతన్య సభ
కులాలకు అతీతంగా అందరికీ దేవాలయాల ప్రవేశం కల్పించిన గొప్ప వ్యక్తి అని ఆయన చెప్పారు.

ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు: చినజీయర్‌స్వామి
అటువంటి రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని శంషాబాద్ సమీపంలోని ఒక ఆలయంలో ప్రతిష్టించనున్నట్లు శ్రీ చిన్నజియ్యర్ స్వామి తెలిపారు.

హిందూ చైతన్య సభ
మాతృశక్తి సంస్థాన్ (మధుర) సాద్వీ పరంపూజ్య హేమలతా శాస్త్రి ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు.

హిందూ చైతన్య సభ
కమలానంద భారతీ స్వామిజీ మాట్లాడుతూ.. ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి కోసం రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయించడం గొప్ప విషయమన్నారు.

హిందూ చైతన్య సభ
చట్టాలు ఎక్కడా అమలు కాకపోయినా.. హిందువుల ఉత్సవాలు, పండగ సందర్భంలో ప్రభుత్వం, పోలీసులు కచ్చితంగా అమలు చేస్తారని ఎద్దేవా చేశారు.

హిందూ చైతన్య సభ
సభలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షులు జి.రాఘవరెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి ద్వారా అయిదు పుస్తకాలను ఆవిష్కరించారు. వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పూర్థ్వకుండాన్ని, శంఖు-చక్రాలను అమర్చిన శ్రీ రామానుజల వారికి 2017వ సంవత్సరానికి వెయ్యి సంవత్సరాలు రానున్నాయని ఆయన తెలిపారు. కులాలకు అతీతంగా అందరికీ దేవాలయాల ప్రవేశం కల్పించిన గొప్ప వ్యక్తి అని ఆయన చెప్పారు. అటువంటి రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని శంషాబాద్ సమీపంలోని ఒక ఆలయంలో ప్రతిష్టించనున్నట్లు శ్రీ చిన్నజియ్యర్ స్వామి తెలిపారు.
కమలానంద భారతీ స్వామిజీ మాట్లాడుతూ.. ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి కోసం రూ.500 కోట్లు బడ్జెట్ కేటాయించడం గొప్ప విషయమన్నారు. చట్టాలు ఎక్కడా అమలు కాకపోయినా.. హిందువుల ఉత్సవాలు, పండగ సందర్భంలో ప్రభుత్వం, పోలీసులు కచ్చితంగా అమలు చేస్తారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications