Malla Reddy Dance: సతీమణితో కలిసి మల్లారెడ్డి మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్

Malla Reddy Dance: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన దూకుడుతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పాలమ్మినా, పూలమ్మినా.. అంటూ సోషల్ మీడియాకు ఎక్కిన మల్లారెడ్డి.. అసెంబ్లీలో తన ప్రసంగాలతో హల్ చల్ అయ్యారు. తన డ్యాన్సులతో కుర్రకారును హుషారెత్తిస్తూ మల్లారెడ్డి ఓ ప్రత్యేకమైన స్టార్ గా అవతరించాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన డ్యాన్సులకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉంటారు. తాజాగా మల్లారెడ్డి మరోసారి తన డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేయడంతో ఆ స్టేజీపై ఉన్నవారంతా ఉత్సాహంతో కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Malla Reddy Mass Dance with Wife Goes Viral

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కల్పనారెడ్డి దంపతుల 49వ విహవా వార్షికోత్సవ వేడుకలను బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి తన భార్యతో కలిసి డ్యాన్స్ స్టెప్పులతో ఉత్సాహాన్ని రేకెత్తించారు.అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి.. అక్కడ ఉన్నవారందరినీ అలరించారు. ఈ వివాహ వార్షికోత్సవ వేడుకల్లో మల్లారెడ్డిపై రాసిన సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోలీ పండుగ సందర్భంగా మల్లా రెడ్డి చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే తన వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని ఆయన ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+