అధికారుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి: ఆ తల్లికి కడుపుకోత(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇటీవల మ్యాన్‌హోల్స్ మూత తెరిచి ఉండటంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఆ తర్వాత డ్రైనేజీలో పనులు చేస్తూ ఊపిరాడక నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. తాజాగా, మరో యువకుడు అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యాడు.
కంటోన్మెంట్ ప్రాంతంలో నాలాపై ఉన్న పైపులైన్లు, కేబుళ్ల మీదుగా దాటేందుకు ప్రయత్నించిన ఓ యువకుడుప్రమాదవశాత్తూ కాల్వలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మూడు నెలల్లో పూర్తి చేస్తామన్న వంతెన ఆరు నెలలైనా కనీసం ప్రారంభించకపోవడంతో ప్రమాదభరితంగా రాకపోకలు సాగిస్తున్న ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
బోయిన్‌పల్లి ఎస్సై శ్రీనివాస్‌రావు, స్థానికుల కథనం ప్రకారం... న్యూ బోయిన్‌పల్లి, చిన్నతోకట్ట ప్రాంతానికి చెందిన మేకల రాకేశ్(30) కారు డ్రైవరు. పలువరు నేతల వద్ద కూడా అతడు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. నెల రోజులుగా ఇంటివద్ద ఖాళీగా ఉంటున్న అతను బుధవారం పనిమీద బయటకు వెళ్లాడు.
కాలినడకన బాపూజీనగర్ నుంచి సెంటర్ పాయింట్ చౌరస్తా వైపునకు వెళ్తూ మార్గం మధ్యలో పునర్నిర్మాణంలో ఉన్న ఫిలిప్స్ గోదాము వంతెన ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ దారి మళ్లించడంతో చుట్టూ తిరిగి వెళ్లలేక నాలాపై ఉన్న పైపులైన్లు, కేబుళ్ల మీదుగా దాటేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో కాలుజారి నాలాలో పడినప్పటికీ పైపులైన్ ఆధారంగా పైకి ఎక్కాడు. మరోసారి కాలుజారి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, బోర్డు అధికారులకు సమాచారాన్ని అందించారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కూడా పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో స్థానికులే మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు చేశారు. చివరకు శివకుమార్, వీరేశ్ అనేఇద్దరు నాలాలోకి దిగి మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, రాకేష్ మృతదేహాన్ని చూసిన ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని తల్లి రోదనలు అక్కడివారిని సైతం కంటతడి పెట్టించాయి.

రాకేష్ మృతదేహం
హైదరాబాద్ నగరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇటీవల మ్యాన్‌హోల్స్ మూత తెరిచి ఉండటంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఆ తర్వాత డ్రైనేజీలో పనులు చేస్తూ ఊపిరాడక నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. తాజాగా, మరో యువకుడు అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యాడు.

ఘటనా స్థలం
కంటోన్మెంట్ ప్రాంతంలో నాలాపై ఉన్న పైపులైన్లు, కేబుళ్ల మీదుగా దాటేందుకు ప్రయత్నించిన ఓ యువకుడుప్రమాదవశాత్తూ కాల్వలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు.

మిన్నంటిన రోదనలు
బోయిన్‌పల్లి ఎస్సై శ్రీనివాస్‌రావు, స్థానికుల కథనం ప్రకారం... న్యూ బోయిన్‌పల్లి, చిన్నతోకట్ట ప్రాంతానికి చెందిన మేకల రాకేశ్(30) కారు డ్రైవరు. పలువరు నేతల వద్ద కూడా అతడు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. నెల రోజులుగా ఇంటివద్ద ఖాళీగా ఉంటున్న అతను బుధవారం పనిమీద బయటకు వెళ్లాడు.

రాకేష్ మృతదేహం
కాలినడకన బాపూజీనగర్ నుంచి సెంటర్ పాయింట్ చౌరస్తా వైపునకు వెళ్తూ మార్గం మధ్యలో పునర్నిర్మాణంలో ఉన్న ఫిలిప్స్ గోదాము వంతెన ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ దారి మళ్లించడంతో చుట్టూ తిరిగి వెళ్లలేక నాలాపై ఉన్న పైపులైన్లు, కేబుళ్ల మీదుగా దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి నాలాలో పడినప్పటికీ పైపులైన్ ఆధారంగా పైకి ఎక్కాడు. మరోసారి కాలుజారి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.












Click it and Unblock the Notifications