కార్గిల్ ఆర్మీలో పనిచేస్తున్న జవాను ఖాతా నిల్: మోసగాడు ఇతనే...

కార్గిల్ ఆర్మీలో పనిచేస్తున్న ఓ జవాను ఖాతా గుల్లయింది. డబ్బులు ఖాతా నుంచి మాయమయ్యాయి. దానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: కార్గిల్ ఆర్మీలో పనిచేస్తున్న జవాను బ్యాంక్ ఖాతా నుంచి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ అయ్యాయి. ఈ ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన వ్యక్తిని తెలంగాణలోని రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న బైళ్ల కిషోర్‌కుమార్ 2015 నుంచి 2017 వరకు తన బ్యాంకు ఖాతాలో రూ. 3.60 లక్షలు జమ చేసుకున్నాడు.

అయితే, గత నెలలో హైదరాబాద్‌లో ఉంటున్న అతని భార్య ఏటిఎం నుంచి కొన్ని డబ్బులు డ్రా చేయగా బ్యాంకులో నుంచి డబ్బులు లేదు. పైగా బ్యాలెన్స్ నిల్ అంటూ సమాచారం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Man arrested for cyber crime in Telangana

నాసిక్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కిషోర్ కుమార్ ఖాతా నుంచి హైదరాబాద్‌లోని అతని బంధువు గుడిపల్లి విష్ణుప్రసాద్ ఖాతాలోకి బదిలీ అయినట్టు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ మేరకు విష్ణుప్రసాద్‌ను అరెస్టు చేసి అతనిపై ఐపిసి 406, 419, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కేసును ఛేదించిన సైబర్ క్రైం ఇన్స్‌పెక్టర్ మహమ్మద్ రియాజుద్దీన్, ఎస్‌ఐ భాస్కర్‌ను రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ ఎం భగవత్ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+