స్నేహితుడని నమ్మి రాత్రి ఇంటికి తీసుకెళ్తే భార్యపై అత్యాచారయత్నం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రాంతంలో నమ్మి స్నేహితుడిని ఇంటికి తీసుకు వస్తే అతని భార్య పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

ఫిలింనగర్‌లోని గాంధీ నగర్‌కు చెందిన సబి మేస్త్రీ పని చేస్తున్నాడు. అతని ఇంటికి సమీపంలోనే అతని స్నేహితుడు నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి స్నేహితుడు ఇంటికి సబి వెళ్లాడు. ఇద్దరు కలిసి రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి వరకు మద్యం తాగారు.

అతిగా మద్యం తాగిన స్నేహితుడు మత్తులో నిద్రపోయాడు. సబి మాత్రం ఇంట్లో నిద్రిస్తున్న స్నేహితుడి భార్య పైన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన మహిళ కేకలు పెడుతూ బయటకు రావడంతో నిందితుడు సబి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Man attempting to rape friend's wife

బాలిక సామూహిక అత్యాచారం

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఒక బాలికపై ముగ్గురు యువకులు మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆ బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. పెంట్లవెళ్లి గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న సదరు బాలిక అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో కొంతకాలం నుంచి ప్రేమకలాపాలు సాగిస్తోంది.

శనివారం సాయంత్రం ఆ బాలికను రామకృష్ణ తన స్నేహితులైన రాజేష్, ప్రకాశ్‌తో కలిసి సమీపంలోని వాగు దగ్గరకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారన్నారు. అదేవిధంగా సోమవారం సాయంత్రం వరకు ఆ బాలికపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడి సాయంత్రం ఆమెను వదిలిపెట్టినట్లు బాధితురాలు తల్లి ఫిర్యాదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+