దర్జాగా కనిపిస్తాడు: యువతుల నగ్నఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తాడు

నిజామాబాద్: దర్జాగా కనిపించే ఓ వ్యక్తి అమ్మాయిలను నమ్మించి, వారితో స్నేహం చేసి, నగ్న ఫోటోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడం పనిగా పెట్టుకున్నాడు. వారికి తెలియకుండా నగ్నంగా ఫొటోలు తీసి వేధిస్తుంటాడు. నిజామాబాద్ జిల్లా భీమగల్ ప్రజలు అతను ఈ పనులు చేస్తాడంటే నమ్మరు. కానీ, విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు.

మూడేళ్ల క్రితం భీమ్‌గల్‌లోని ఓ యువ తిని ఇదే తరహాలో అసభ్యకరమైన ఫొటోలు తీశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయిని వేధిస్తున్న అతడు చివరకు పోలీసులకు చిక్కి నిర్భయ కేసులో ఇరుక్కున్నాడు. కరీంనగర్ జిల్లా బండ లింగాపూర్ గ్రామానికి చెందిన అతను సుమారు ఐదేళ్ల క్రితం భీమ్‌గల్ మండల కేంద్రానికి వ్యాపారం నిమిత్తం వచ్చాడు.

Man blackmailing girls in Nizamabad

అతను ముఠాను కూడా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు గతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నింబాచల క్షేత్రానికి సరదా కోసం వచ్చే జంటలను బ్లాక్‌మెయిల్ చేసే ముఠాలో సభ్యుడిగా కొనసాగాడు. ఎలక్ట్రానికి వ్యాపారం పేరు మీద నీలి చిత్రాల వ్యాపారం చేస్తున్నాడు.

సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో నీలి చిత్రాలను లోడ్ చేస్తూ యువకులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ వస్తున్నాడు. తన అక్రమ దందాలను కాపాడుకునేందుకు కొద్ది కాలం పాటు అతగాడు ఓ దినపత్రికలో విలేకరినంటూ చెప్పుకుని తిరిగాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+