రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య, మరోచోట గుర్తు తెలియని మృతదేహం
ఐనవోలు మండలం పంథిని గ్రామానికి చెందిన చిలుక సమ్మయ్య(30) ఆదివారం నగరంలోని రైల్వేగేటు వ్దద గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వరంగల్ జీఆర్‌పీ సీఐ స్వామి తెలిపారు.
వరంగల్: ఐనవోలు మండలం పంథిని గ్రామానికి చెందిన చిలుక సమ్మయ్య(30) ఆదివారం నగరంలోని రైల్వేగేటు వ్దద గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వరంగల్ జీఆర్‌పీ సీఐ స్వామి తెలిపారు.
రోజు కూలీ పనిచేసుకుంటుండే సమ్మయ్య కొంతకాలంగా మానసిక అనారోత్యంతో బాధపడుతూ ఆ బాధ భరించలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మృతుడి జేడులోని ఫోన్ డైరీలో లభించిన మృతుడి భార్య మాధవి సెల్‌ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చినట్లు తెలిపారు.

ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ఆయన తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
వరంగల్ రైల్వే స్టేసన్‌లోని మొదటి ప్లాట్ పాం పైన ఆర్‌పీఎఫ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని (35) మృతదేహం కనిపించిందని వరంగల్ జీఆర్‌పీ సీఐ స్వామి తెలిపారు.
మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు సమాచారం లభించలేదని, మృతుడు అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చని చెప్పారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచామని, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు వరంగల్ జీఆర్‌పీ స్టేషన్ 0870-2443544, ఎంజీఎం మార్చురీలో సంప్రదించాలని సీఐ కోరారు.












Click it and Unblock the Notifications