రైలుపైకెక్కి హంగామా, వైర్ పట్టుకొని కాలిపోయాడు

హైదరాబాద్: సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్లో ఓ మానసిక రోగి సోమవారం నాడు హల్ చల్ చేశాడు. అధికారులకు రెండు గంటల పాటు ముచ్చెమటలు పట్టించాడు. రైల్వే స్టేషన్లోని పదో నెంబర్ ప్లాట్ ఫాంలో ఆగి ఉన్న రైలును సదరు మానసిక రోగి ఎక్కి హంగామా సృష్టించాడు.

అతనిని పట్టుకునేందుకు అధికారులు, రైల్వే పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. రైలు పైకి ఎక్కి అటు ఇటు తిరుగుతూ గడిపాడు. చివరకు హైవోల్టేజ్ విద్యుత్ తీగను పట్టుకున్నాడు. దీంతో రైలు పైనే కాలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతను చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. మృతుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన వాడిగా తెలుస్తోంది.

Man hulchul in Secunderabad railway station

రైల్వే ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ

సికింద్రాబాదులోని అల్వాల్‌లో ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న 25 తులాల బంగారు, 30 తులాల వెండి, రూ.11 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

అనారోగ్యంతో విద్యార్థిని మృతి

అనారోగ్యంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. వికారాబాద్ మండలం కొత్తగడిలో సంక్షేమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లుగా తెలిసింది. తమ కుమార్తె ఆరోగ్యం గురించి సరైన సమాచారం ఇవ్వలేదని మృతదేహంతో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+