నేను ఎస్సైని.. ప్రేమించు!: యువతికి వ్యక్తి బెదిరింపు

హైదరాబాద్: సంతోష్ నగర్ పోలీసు స్టేషన్ ఎస్సైగా పని చేస్తున్నానని చెప్పిన ఓ యువతిని వేధిస్తున్న యువకిడిని పోలీసులు రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. యాకుత్ పురా మాదన్నపేటకు చెందిన ఇబ్రహీం ఉల్ హక్, రియాసత్ నగర్‌కు చెందిన ఓ యువతి అంబేద్కర్ వర్సిటీలో బీఏ చదివారు.

ఈ నేపథ్యంలో తాను ఎస్సైగా పని చేస్తున్నానని, తనను ప్రేమించాలని సదరు యువకుడు కొద్ది నెలలుగా యువతిని వేధిస్తున్నాడు. ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అతను నకిలీ ఎస్సై అనే విషయం బయటపడింది.

 Man sent into custody for harassing girl

అద్దె ఇంట్లో గుర్తు తెలియని యువతి ఆత్మహత్య

ఓ యువతి తాను నివసిస్తున్న అద్దె ఇంట్లో బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అంజయ్య నగర్లో ఉంటున్న సుందరి ఉరఫ్ సౌందర్యగా పరిచయం చేసుకున్న యువతి (22) ఇరవై రోజులుగా అద్దె ఇంట్లో నివసిస్తోంది.

తన వివరాలు ఎవరికీ చెప్పలేదు. ఒంటరిగా ఉంటూ ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడేది. బుధవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో స్థానికులు గమనించారు. లోపలకు వెళ్లి చూడగా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సుల్తాన్ బజార్‌ పోలీసు స్టేషన్ పరిధిలో మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వైదేహీకి ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

నాలుగేళ్లుగా వారు బడీచౌడీలో ఉంటున్నారు. లక్ష్మణ్ వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. టైలరింగ్ కూడా చేస్తున్నాడు. వైదేహీ తెలుగు పండిట్ కోర్స్ చేస్తోంది. బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలోతన గదిలో వైదేహీ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్ చేసుకుంది. తన కుమార్తె మృతికి భర్త, మరుదులు కారణమని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+