Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంగారెడ్డిలో దారుణం.. నడిరోడ్డుపై యువకున్ని నరికి చంపారు..

రుద్రారం : సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. నేషనల్ హైవేపై పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని హత్య చేశారు. పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద జాతీయ రహదారిపై మహబూబ్ అనే యువకున్ని నరికి చంపారు. మోటర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై మహబూబ్‌పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. దీంతో అతను స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.

నడి రోడ్డుపై హత్య జరగడంతో రోడ్డుపై వెళ్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అయితే నడిరోడ్డుపై పట్టపగలే ఇంత ఘోరం జరుగుతున్న నిందితుడి చేతిలో కత్తి ఉండటంతో ఎవరూ అడ్డుకోలేకపోయారు. మహబూబ్‌ను నరికి చంపిన అనంతరం దుండగులు ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.

man stabbed to death on sanga reddy highway

ఐదునెలల క్రితం రుద్రారంలో జరిగిన మర్డర్ కేసులో మహమూద్ నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మహబూబ్ చేతిలో హత్యకు గురైన వ్యక్తి సంబంధీకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మర్డర్ విషయం తెలిసి ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+