హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్న ‘మనమాతృభాషతెలుగు’

|
Google Oneindia TeluguNews

Recommended Video

#మనమాతృభాషతెలుగు : ట్విట్టర్‌లో ట్రెండింగ్ | Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచ తెలుగు సభల నిర్వహిస్తున్న నేపథ్యంలో #మనమాతృభాషతెలుగు అనే హ్యాష్‌ట్యాగ్‌.. ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు 2017 ప్రారంభ వేడుకలు శుక్రవారం సాయంత్రం 5గంటలకు వైభవంగా ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేసింది. ప్రధాన వేదికతోపాటు హైదరాబాద్ మొత్తం ప్రముఖ కవులు, రచయితల హోర్డింగులు, కమాన్లతో తీర్చిదిద్ధింది.

mana telugu matrubhasha trending in twitter

ఎల్పీ స్టేడియంతోపాటు మరో ఆరు వేదికల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. కాగా,
సుమారు 6వేల మందికిపైగా అతిథులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. మహాసభల సందర్భంగా తెలుగు భాషా సదస్సులు, కవి సమ్మేళనాలు, చర్చా గోష్ఠులు, కథా సాహిత్యం, నవల, విమర్మ, గేయం, బాల, మహిళా సాహిత్యాలు, చరిత్ర, పరిశోధన, తెలుగు భాషపై విస్తృత చర్చలు జరుగుతాయి.

అంతేగాక, అష్టావధానం, హాస్యావధానం, జంట కవులు, నేత్ర, శతావధానాలు జరుగుతాయి. కాగా, ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఆయనతోపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్, సీఎం కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి, కవులు, రచయితలు, భాషాభిమానులు పాల్గొననున్నారు.

English summary
It is said that manatelugumatrubhasha trending in twitter now. ప్రపంచ తెలుగు సభల నిర్వహిస్తున్న నేపథ్యంలో #మనమాతృభాషతెలుగు అనే హ్యాష్‌ట్యాగ్‌.. ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు 2017 ప్రారంభ వేడుకలు శుక్రవారం సాయంత్రం 5గంటలకు వైభవంగా ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X