Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పై మారుతున్న కాంగ్రెస్ లెక్కలు - కీలక మలుపు..!!

ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జగన్ లక్ష్యంగా ఏపీ రాజకీయం నడుస్తోంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న మూడు పార్టీల కూటమి 2029 ఎన్నికల దిశగా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది. ఇటు జగన్ సైతం కూటమి పైన పోరుబాటకు సిద్దం అవుతున్నారు. ఇక, ఏపీ లో కాంగ్రెస్ కొత్త గేమ్ మొదలు పెట్టింది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్న వేళ.. జాతీయ స్థా యి లో బీజేపీ - ఆ పార్టీ మిత్రపక్షాల పై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ తీరు ఏపీలో భిన్నంగా ఉంది. ఇప్పుడు తాజాగా పార్టీ హైకమాండ్ వ్యూహం ఏంటనేది స్పష్టంగా కనిపిస్తోంది.

కీలక సమీకరణాలు
ఏపీలో 2024 ఎన్నికల వేళ కీలక అనూహ్య సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. మూడు పార్టీల కూటమి వర్సస్ జగన్ అన్నట్లుగా ఎన్నికలు జరిగినా.. షర్మిల సైతం వైసీపీ ఓటమి కోసం తన వంతు పాత్ర పోషించారు. షర్మిల - సునీత జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసారు. ఎన్నికల్లో ఓడిన తరువాత సైతం కూటమి ప్రభుత్వం కంటే జగన్ పైనే షర్మిల ఎక్కువగా విమర్శలు చేస్తు న్నారు. దీంతో, కాంగ్రెస్ నేతలు సైతం షర్మిల తీరు పైన హైకమాండ్ కు ఫిర్యాదులు చేసారు. తన అన్న పైన కోపంతోనే షర్మిల పీసీసీ చీఫ్ గా కూటమి ప్రభుత్వం కంటే ఎక్కువగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే లేఖల్లో పేర్కొన్నారు. కాగా, జగన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వం వైఖరి స్పష్టం అవుతోంది.

manickam-tagore-key-comments-against-ys-jagan-new-trun-in-ap-politics

మారుతున్న లెక్కలు
కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదిరించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని జగన్ సీఎం అయ్యారు. నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ తిరిగి కోలుకోలేదు. మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్క అసెంబ్లీ సీటు గెలవలేదు. కాంగ్రెస్ నుంచి వీడి జగన్ వద్దకు వెళ్లిన వారిని తిరిగి సొంత పార్టీలోకి తీసుకొచ్చేందు కు జగన్ తో ఉన్న వైరం రాజకీయంగా కలిసి వస్తుందనే ఉద్దేశంతో షర్మిల కు పీసీసీ చీఫ్ పగ్గాలు ఇచ్చారనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే, షర్మిల ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతం చేయటం లో సక్సెస్ కావటం లేదనే అభిప్రాయం ఉంది. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ పైన పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఏపీలో భిన్నంగా వైసీపీని లక్ష్యంగా చేసుకుంటోంది. తాజాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ సైతం జగన్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

https://twitter.com/manickamtagore/status/1936988409077146100

కాంగ్రెస్ టార్గెట్
లిక్కర్ కేసు విచారణలో భాగంగా వస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు. తాడేపల్లి, అమరావతిలో జగన్ నిధులు దాచి పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు మాత్రం నామ మాత్రంగానే వ్యవహరిస్తున్నారు. చింతా మోహన్ లాంటి వారు మినహా మిగిలిన కాంగ్రెస్ నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో, తమ పార్టీకి నష్టం చేసిన జగన్ ఏపీలో తమ టార్గెట్ అనే విధంగా కాంగ్రెస్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఇలా వరుసగా కూటమి.. కాంగ్రెస్ తో పాటుగా మద్దతు దారుల నుంచి ముప్పేట దాడి ఎదుర్కొంటున్న జగన్.. పార్టీని ఎలా కాపాడుకుంటారు.. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+